ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాబడి ఇచ్చే రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కాబట్టి కేవలం బ్యాంకులలోనే కాకుండా పోస్ట్ ఆఫీస్ లో కూడా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే తక్కువ పట్టుబడితో ఎక్కువ రాబడి పొందడానికి వివిధ రకాల పథకాలు పోస్ట్ ఆఫీస్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళిక కోసం ముందస్తుగా పోస్ట్ ఆఫీస్ లో ఉండే స్కీం లను ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. దీనివల్ల మెచ్యూరిటీ తర్వాత లక్షల్లో కూడా రాబడి అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో ఉండే పథకాలు ఎప్పుడూ కూడా సురక్షితమే. అంతేకాదు ఎక్కువ లాభాలు కూడా లభిస్తాయి. వడ్డీ రేట్లు కూడా అధికంగా ఉండటమే కాకుండా ఎటువంటి డబ్బు ఇబ్బంది ఉండదు.


ముఖ్యంగా ఈ స్కీములో మీకు సురక్షితంగా ఉండటమే కాకుండా ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశం కూడా లభిస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ లో ఉండే రికరింగ్ డిపాజిట్ పథకం కస్టమర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ లో ఉండే పథకాలలో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి బెనిఫిట్ అందించే పథకాలలో రికరింగ్ డిపాజిట్ పథకం అనే ఒక స్మాల్ సేవింగ్ స్కీం కూడా ఒకటి. ఇందులో ఎంత వీలైతే అంత డిపాజిట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రెండు ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ సమయం కోసం కూడా మీరు పెట్టుబడి పెట్టే అవకాశం. ఇక ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లభిస్తుంది. ఇక వడ్డీ 5.8 శాతంగా ఉంటుంది.


ఈ పథకంలో దీర్ఘకాల ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. అంతేకాదు రుణ సదుపాయం కూడా ఉంటుంది.  ఈ పథకంలో మీరు సంవత్సరం పాటు జమ చేస్తే.. రుణం తీసుకోవచ్చు. ఇక మీ  అకౌంట్లో మీరు జమ చేసిన మొత్తంలో 50% రుణం కింద పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ పథకంలో రూ.10 వేల  చొప్పున 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే రూ.16 లక్షలు మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: