తాజాగా భారత దేశం లో కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న కోట్లాదిమంది రైతులకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి శుభవార్తను అందించింది. ఈ క్రమంలోని కిసాన్ క్రెడిట్ కార్డ్ మీద ఇచ్చే స్వల్పకాలిక రుణాల కోసం అందించే రాయితీని ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించాలని ఆర్బిఐ నిర్ణయించింది.  ముఖ్యంగా ఈ నిర్ణయం తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న ప్రతి రైతుకు వ్యవసాయ సంబంధిత పనుల కోసం బ్యాంకు రుణం లభించడమే కాకుండా రాయితీ కూడా లభిస్తుంది.

ముఖ్యంగా బ్యాంకుల ద్వారా తీసుకునే రుణం మీద 7 శాతం వడ్డీ ఉంటుంది.  ఈ ఏడు శాతం లో కేంద్ర ప్రభుత్వం 1.5 శాతం మొత్తాన్ని రాయితీ రూపంలో భరిస్తుంది.  అంతేకాదు ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుందని స్పష్టం చేసింది ఆర్బిఐ. మొత్తంగా చూసుకుంటే కిసాన్ క్రెడిట్ కార్డు మీద తీసుకునే అప్పు మీద మీరు కేవలం నాలుగు శాతం వడ్డీ రేటు చెల్లిస్తే సరిపోతుంది. నాలుగు శాతం వడ్డీ కేవలం 25 పైసలు వడ్డీకి మాత్రమే సమానం.

అంతేకాదు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయలను రైతులకు అప్పు కింద ఇస్తుంది.  రైతులు ఈ డబ్బును వ్యవసాయం,  పాడి పరిశ్రమ,  తేనెటీగల పెంపకం ,ఇతర వ్యవసాయ రంగ సంబంధిత పనులకు ఉపయోగించు కోవచ్చు. అంతేకాదు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు,  తదితర వాటి కోసం కూడా రైతులు ఈ రుణాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకు బుధవారం నోటిఫికేషన్ ఇస్తూ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకు ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: