ఫిక్స్డ్ డిపాజిట్ లపై తాజాగా వడ్డీరేట్లు పెంచుతూ కస్టమర్లకు న్యూ ఇయర్ కానుకగా ప్రకటించింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు రూ.2కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు డిపాజిట్ లకు వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది.. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందిస్తున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 27 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ పెంపు తర్వాత చూస్తే బ్యాంకు ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్ లోని ఫిక్స్ డిపాజిట్ ల పై 4.5 శాతం నుంచి 7 శాతం వడ్డీని అందిస్తోంది. అంతేకాదు సీనియర్ సిటిజన్స్ కైతే ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. వీరికి ఐదు శాతం నుండి 7.75% వరకు వడ్డీ లభిస్తుందని స్పష్టం చేసింది.


ఇకపోతే రెగ్యులర్ కస్టమర్లకు 15 నెలల నుంచి రెండేళ్ల టెన్యూర్ లోని ఫిక్స్ డిపాజిట్లు పై గరిష్టంగా ఏడు శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్స్ కైతే గరిష్టంగా 7.75% వడ్డీ రేటు ఉంటుంది. ఐదు సంవత్సరాల టెన్యూర్ లోని ఫిక్స్ డిపాజిట్ లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది అంటే సీనియర్ సిటిజన్స్ కి ఎక్కువ వడ్డీ బెనిఫిట్ ఉందని కూడా చెప్పవచ్చు. ఇకపోతే ఏడు రోజుల నుంచి 29 రోజుల టెన్యూర్ లోని ఫిక్స్ డిపాజిట్లపై 4.5% వడ్డీ రేటు ఉంటుంది. అలాగే 30 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్ డిపాజిట్ లపై ఐదు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ లభిస్తుంది.


ఇక 46 రోజుల నుంచి 60 రోజుల ఫిక్స్ డిపాజిట్లు పై ఐదు పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది. 61 రోజుల నుంచి 89 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ లపై 5.75% వడ్డీ రేటు లభిస్తుంది. 90 రోజుల నుంచి 6 నెలల ఫిక్స్ డిపాజిట్లు పై 6.1శాతం వడ్డీ రేటు పొందవచ్చు. 15 నెలల నుంచి రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు పై 7.15% వడ్డీ రేటు లభిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: