పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటుందని మనకందరికి తెలిసిందే. నాకొచ్చం తిక్కుంది కాని దానికో లెక్కుంది అని డైలాగ్ టాలీవుడ్లో ఏ హీరో చెప్పినా సూట్ అవదు ఎందుకంటే కాస్త కూస్తో డైలాగుల్లో పలికే తిక్క, చెప్పే హీరోల్లో కూడా ఉండాలి కాబట్టి.. ఇక సింహంకి నాకు తేడా లేదు ఒట్టి గడ్డ గీసుకోవడం తప్పా అని హీరోయిజం గురించి కూడా అంత పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పరు.. మన పవర్ స్టార్ తప్ప అయితే.. పవన్ కళ్యాణ్ స్టార్ గా తన మీద తనకున్న నమ్మకం చాలా ఎక్కువ అందుకే తనకు తోచింది చేస్తుంటాడు.


అయితే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు జానీ అంటూ మంచి కథే అయినా తన దర్శకత్వంలో చేసి చేతులు కాల్చుకున్నాడు పవర్ స్టార్. అయితే అదే దారిలో గుడుంబా శంకర్ అంటూ ఓ సినిమా తీసి పేరుకి వీరశంకర్ అనే డమ్మీ డైరక్టర్ ని పెట్టి స్క్రీన్ ప్లే మొత్తం తానే నడిపించి మళ్లీ దెబ్బయ్యేలా చేసుకున్నాడు. ఇక పులి విషయంలో కాస్త ఎక్కువే చొరవచూపించి అసలకే మోసం వచ్చేలా చేసుకున్నాడు.


పవర్ స్టార్ స్టామినా ఇది అని కొలిచే వ్యాపకం ఏది లేదంటే నమ్మాలి అది అభిమానులకు కూడా బాగా తెలుసు. అయితే ఇప్పుడు తన తిక్కను ప్రస్తుతం తీస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ మీద పెడుతున్నాడని తెలుస్తుంది. సినిమా కథ కథనాల్లో ఇప్పటికే అన్నీ తానై నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాకు యాక్షన్ అదేనండి ఫైట్స్ కూడా కంపోజ్ చేస్తున్నాడని వార్త. అయితే సినిమా అన్ని రంగాల్లో అనుభవం ఉండటం మంచిదే కాని ప్రయోగాలు చేస్తే అసలకే మోసం వస్తుందని రెండు మూడు సార్లు దెబ్బ తిన్నా మంచు మనోజ్ లా తన ఫైట్స్ తానే కంపోజ్ చేసుకుంటున్నాడట పవర్ స్టార్.


అన్ని మంచిగా కుదిరి అవి క్లిక్ అయితే ఓకే కాని ఒకవేళ అది కాస్త ఏమన్నా తేడా కొడితే గబ్బర్ సింగ్ సినిమాకు ఉన్న ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. జానీలా దర్శకత్వం మొత్తం తానే చేస్తూ.. గుడుంబా శంకర్ సినిమాలా పేరుకి దర్శకుడు బాబి అని పెడుతూ చేసే సర్ధార్ గబ్బర్ సింగ్ తేడా రాకుండా నమ్మకమీయరా.. సామీ.. అంటూ ప్రతి ఒక్క పవర్ స్టార్ అభిమాని ఆయన్ను వేడుకుంటున్నారు..! 


మరింత సమాచారం తెలుసుకోండి: