నిన్న ముగిసి పోయిన ఫిబ్రవరి 29 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం లీప్ ఇయిర్ కు సంబంధించింది అన్న విషయం తెలిసిందే. 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ లీప్ ఇయర్ లో వచ్చే ఫిబ్రవరి 29న పుట్టిన వారికి పుట్టినరోజు చేసుకోవాలి అంటే మరో నాలుగు సంవత్సరాలు ఆగాలి. ఈ విషయంలో ఈ లీప్ ఇయర్ కు పవన్ కు ఒక విచిత్రమైన లింక్ ఉంది. 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ లీప్ ఇయర్ పవన్ కెరియర్ ను విపరీతమైన ప్రభావితం చేసింది. సినిమాల హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ కెరియర్ గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నా ఈ లీప్ ఇయర్ లో వచ్చిన పవన్ సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారితే మరికొన్ని సూపర్ ఫ్లాప్ లుగా మారాయి. 

పవన్ తొలి చిత్రం ఇవివి సత్యనారాయ దర్శకత్వంలో రూపొందిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ 1996 రిలీజైంది. అది లీఫ్ సంవత్సరమే అయితే మొదటి సినిమా పవన్ ను నిరాశ పరిచింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి’ చిత్రం 2000లో రిలీజైంది అదికూడా లీప్ ఇయిర్ కావటం విశేషం. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా పవన్ ను పవర్ స్టార్ గా మార్చేసింది. ఆతరువాత వీరశంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గుడుంబా శంకర్’ 2004 లీప్ ఇయర్ లో విడుదలైంది. ఈసినిమా కూడ పవన్ కళ్యాణ్ ను నిరాశ పరిచింది. 

అయితే 2008 లో వచ్చిన  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘జల్సా’ పవన్ ఇమేజ్ ను మరింత పెంచింది. ఆ తరువాత వరస ప్లాప్ లతో సతమతమైపోతున్న పవన్ కళ్యాణ్ కెరియర్ ను 2012 లో విడుదలైన హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ పవన్ వరస ఫ్లాప్ ల వ్యవహారానికి అడ్డుకట్ట వేసింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఎంపరర్ గా మారిపోయిన విషయం తెలిసిందే. మళ్ళీ 4 సంవత్సరాల విరామంతో ఈ సంవంత్సరం లీప్ ఇయర్ ఎంటర్ అయింది. 

ఇప్పుడు పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఈ లీప్ ఇయర్ ఏప్రియల్ విడుదల కాబోతోంది. అయితే ఈ లీప్ ఇయర్ లలో గతంలో విడుదలైన పవన్ సినిమాలు కొన్ని భయంకరమైన ఫ్లాప్ లుగా మారితే మరికొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారాయి. మరి ఇప్పుడు ఈ 2016 లీప్ ఇయర్ పవన్ కు ఎటువంటి రిజల్ట్ ని ఇస్తుందో అనే టెన్షన్  లో పవన్ అభిమానులు నిన్నటిరోజు ఫిబ్రవరి 29న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా గురించి లెక్కలు వేసుకుంటూ కాలం గడిపారని టాక్. అయితే ఈ లీప్ ఇయర్ పవన్ కు ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: