ఈ మద్య టాలీవుడ్ లో అమెరికా సెక్స్ రాకెట్ ప్రకంపణలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కొంత మంది హీరోయిన్లు, యాంకర్లు సెక్స్ రాకెట్ కుంభకోణంలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  అమెరికాలో సెక్స్ రాకెట్ కుంభకోణం బయట ప్రపంచానికి పొక్కడం, ఆ వ్యవహారంలో నిర్మాత మొదుగుముడి కిషన్, ఆయన సతీమణి చంద్రకళ అరెస్ట్ కావడంతో టాలీవుడ్ లో రక రకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి.  ఈ క్రమంలో యువ అందాల తార మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా పేరు కూడా మీడియాలో ప్రచారమైంది.
నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు
వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ వెళుతున్న తనను అమెరికా సరిహద్దు భద్రతాధికారులు విచారించారని, వారి నోటి నుంచే టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ రాకెట్ పై తొలిసారి సమాచారం విన్నానని గతంలో చెప్పిన హీరోయిన్ మెహ్రీన్, మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయమై ఇంకాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.  పంతం సినిమా ప్రమోషన్‌లో భాగంగా మెహ్రీన్ మాట్లాడుతూ.
ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారించారు.
యూఎస్ సెక్స్ రాకెట్‌లోకి మీడియా నా పేరు లాగింది. కొన్ని మీడియా సంస్థలు నా గురించి ఏవేవో కథనాలు వెల్లడించాయి.   "ఈ కథనం పూర్తి అవాస్తవం. నేను ఆ ఇంటర్వ్యూను ఇవ్వలేదు. మీడియాతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అసలు 'పంతం' ప్రమోషన్ కార్యక్రమంలో నేను పాల్గొనలేదు. ఆ సమయంలో వైరల్ ఫీవర్ తో ముంబైలో ఉన్నాను" అని చెప్పుకొచ్చింది.
Image result for మెహ్రీన్
అయితే సెక్స్ రాకెట్ వివాదం నేపథ్యంలో అమెరికాలో ఓ జరిగిన సంఘటన గురించి చెప్పాలనుకొంటున్నాను. విహార యాత్రలో భాగంగా నేను నా ఫ్యామిలీతో కలిసి వాంకోవర్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్తున్నాను. నన్ను సినీ తారగా గుర్తించి ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారించారు. ఆపై నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. ఈ విషయాన్ని నేనే బహిరంగ పరిచాను. మరెవరైనా ఈ విషయంపై అవాస్తవాలు ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ పని చేశాను. ఆ సమయంలో నా పరిస్థితికి నేను సిగ్గుపడ్డాను. వణికిపోయాను కూడా" అని వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: