ప్రపంచ సుందరి కిరీటం తరువాత ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ లో అనేక సినిమాలు చేసింది.  కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఐష్... అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకొని సెటిల్ అయింది.  వివాహం తరువాత కూడా ఐశ్వర్యారాయ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం విశేషం.  ఇండస్ట్రీలో దర్శకుడు మణిరత్నంకు ఓ ప్రత్యేకమైన పేరు ఉంది.  ఆయన సినిమాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి.  వివాదాలకు కూడా తావునిస్తాయి.  రావణ్ సినిమా సమయంలో బోలెడంత విమర్శలు ఎదుర్కొన్నాడు.  అందులో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేసింది. 

ఇప్పుడు మరలా మణిరత్నంతో కలిసి పనిచేసే ఛాన్స్ కొట్టేసింది.  పొన్నియన్ సెల్వన్ అనే చారిత్రాత్మక సినిమాలో ఐశ్వర్య రాయ్ ను తీసుకున్నారు.  ఇందులో ఐష్ నెగెటివ్ షేడ్ ఉండే పాత్రలో కనిపిస్తుంది.  నెగెటివ్ షెడ్ ఉండే పాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు.  చాలా కష్టసాధ్యం.  హీరోయిన్ గా చేయాలంటే గ్లామర్ ఉంటె సరిపోతుంది.  విలన్ పాత్రకు గ్లామర్ కాదు.. అభినయం ముఖ్యం.  


ఇప్పటి వరకు ఐశ్వర్య రాయ్ అలాంటి పాత్ర చేయలేదు.  నెగెటివ్ షేడ్ ఉండే పాత్రలో ఐష్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే.  ఆమె పేస్ అందుకు సరిపోతుందా అన్నది అందరిలోనూ ఉదయిస్తున్న ప్రశ్న.  పొన్నియన్ సెల్వన్ లో ఐష్ నందిని అనే పాత్ర చేస్తోంది.  మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.  మోహన్ బాబు భార్యగా, రాజ్యాధికారం కోసం ద్రోహానికి పాల్పడే వ్యక్తిగా ఐశ్వర్య రాయ్ కనిపించబోతున్నది.  అమితాబ్, విక్రమ్, విజయ్ సేతుపతి, కీర్తి సురేష్, అనుష్క తదితరులు నటిస్తున్న ఈ సినిమాను రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్, మద్రాస్ టాకీస్ లు కలిసి నిర్మిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: