భారతీయ సినిమా చరిత్రలో ఎందరో స్టార్ హీరోయిన్లు తమకు తాముగా సొంతంగా ఫ్యాన్ బేస్ ను కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడూ హీరోల కంటే తక్కువ పారితోషికంతోనే సినిమాల్లో నటిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఈ సమస్య మీద చర్చ జరుగుతూనే ఉంది. 
 
హీరోయిన్ రాధికా ఆప్టే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ అన్యాయం గురించి మాట్లాడుతూ స్టార్ హీరోయిన్లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమాలు హిట్టవుతుండడంతో తమకు హీరోలతో సమానంగా ప్రాధాన్యత పెరుగుతుందని సినిమా ఇండస్ట్రీలో మార్పు మొదలైందని ఆమె తెలిపారు. 
 
హీరోలు ఎప్పుడూ తమకంటే మూడు రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని చాలా మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉన్నారని ఇందుకు హీరోలు మాత్రమే కారణం కాదని సమాజం కూడా కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

దీపికా పదుకొనే, ప్రియంక చోప్రా నటించిన సినిమాలు కూడా సల్మా న్ సినిమాల మాదిరిగా హిట్టైతే నిర్మాతలు పారితోషకం ఇవ్వడంలో విభేదాలు చూపించ రని లేడీ సూపర్ స్టార్ అంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారేమోనని అని ఆమె అన్నారు. 


కొంతమంది మూవీ మేకర్లు హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన మూవీలను తీయడానికి సిద్దంగా ఉన్నారని రాధికా ఆప్టే తెలిపారు. రజనీకాంత్ కబాలి మూవీ తర్వాత ఈమె నటిస్తున్న మరికొన్ని సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: