పవన్ అత్తారింటికి రిలీజ్ అయి పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగను తెచ్చింది. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ పండుగ ఎప్పుడెప్పుడా అంటూ రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రతిరోజు ‘రామయ్యా వస్తావయ్యా’ కు సంబందించిన వార్తలు వింటూ, చదువుతూ జూనియర్ అభిమానులు ఆసినిమా పై విపరీతమైన అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ వార్తల నేపధ్యంలో ఎవ్వరూ ఉహించనంత అందంగా ఈసినిమాలో జూనియర్ ఉంటాడని ఈ చిత్ర దర్శకుడు చెపుతూ ఉండటంతో ఈ సినిమా పై మరన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలను యూత్ తెగ ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన ‘నేనెప్పుడైనా అనుకున్నానా, కనురెప్ప మూసి కలగన్నానా’ అనే పాట ఒక వైరల్ ఫీవర్ లా రాష్ట్రంలోని ప్రతీ కాఫీ షాపుల్లోను వినపడుతూ ఆ పాటకు ఎన్టీఆర్ ఎటువంటి స్టెప్స్ వేసాడోఅంటూ  ఎవరు ఉహకు తగ్గట్టుగా వారు ఉహించుకుంటు టైమ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సామాన్యంగా ఎన్టీఆర్ రొమాంటిక్ పాటలకు ఇలాంటి క్రేజ్ వచ్చిన సందర్భాలు చాలా అరుదు.

‘రామయ్య’ సినిమాలో ఎన్టీఆర్ పాటలకు వస్తున్న ఆదరణను చూస్తూ ఉంటే మాస్ హీరో ఎన్టీఆర్ తను కోరుకున్న లవ్వర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నట్లే అనిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈసినిమాకు మంచి క్రేజ్ వచ్చింది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మన బుడ్డోడు కూడా మిగతా రాష్టాల మార్కెట్ పై కన్నేసాడు అనే అనుకోవాలి. ఇకరబోతున్న దసరా జూనియర్ హడావిడితో గడిచేలా కనిపిస్తోంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: