ఓ నటికి కావలసిందేమిటి! అందమా? ఆకర్షణా? టాలెంటా? ఈ మూడూ సమంతకి ఉన్నాయి. వీటితో పాటు అదనంగా కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయామెకి. అవి... క్రమశిక్షణ, కమిట్మెంట్. ఇప్పటికే ఆమె చాలా క్రమశిక్షణ గల నటి అంటూ అందరూ మెచ్చకున్నారు. అయితే ఆమె కమిట్మెంట్ ఎలా ఉంటుందో తాజాగా నిరూపణ అయ్యింది.

మొన్న సమంతాకి వైరల్ ఫీవర్ వచ్చింది. రెండు మూడు రోజుల పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడింది. అయినా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. అంతలోనే రభస షూటింగ్ చేయాల్సిన రోజు దగ్గర పడింది. నీరసంగా ఉందని కబురు చేయలేదు సమంత. నేను రాలేనంటూ పనిని వాయిదా వేయమని కోరలేదు. టైముకి సెట్లో ఉంది. నిజానికి ఆమె రాదని, రాలేదని అందరూ అనుకున్నారు. కానీ సమంత వచ్చేసింది. ఆమెని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

నీరసంగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, నా ఒక్కదాని కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, అందుకే వచ్చేశాను అంటూ సింపుల్ గా తేల్చేసింది. ఆమె కమిట్మెంట్ కి అందరూ హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయారు. సెట్లోంచి చెప్పకుండా వెళ్లిపోవడం, ఇన్ ఫామ్ చేయకుండా షూటింగ్ ఎగ్గొట్టడం లాంటివి చేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరూ సమంతను చూసి నేర్చుకోవాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: