కాస్టింగ్, కామెడీ, సినిమాటోగ్రఫీ, ఇంటర్వల్కాస్టింగ్, కామెడీ, సినిమాటోగ్రఫీ, ఇంటర్వల్సెకండ్ హాఫ్, క్లైమాక్స్
డైరక్టర్ విశాల్ (సత్యదేవ్) తన సినిమాలో హీరోయిన్ గా షాలిని (నివేదా పేతురాజ్) ను ఎలాగైనా ఒప్పించాలని అనుకుంటాడు. ఆమెను మెప్పించే కథ మొదలు పెడతాడు. ఇక మరో పక్క ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయిన రాహుల్ (శ్రీ విష్ణు), రాకీ (ప్రియదర్శి), ర్యాంబో (రాహుల్ రామకృష్ణ) ముగ్గురు ఫ్రెండ్స్ మిత్ర (నివేదా థామస్) తో స్నేహం చేస్తారు. మిత్రాకు వచ్చిన ఓ సమస్య నుండి తప్పించడానికి అనుకోకుండా వీళ్లు ముగ్గురు సమస్యల్లో చిక్కుకుంటారు. ఇంతకీ మిత్రాకు వచ్చిన సమస్య ఏంటి..? ముగ్గురు స్నేహితులు ఏం చేశారు..? ఇది క్రైం స్టోరీగా ఎలా మారింది అన్నది సినిమా.



శ్రీ విష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. సత్యదేవ్ కూడా మెప్పించాడు. వీరితో పాటుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా తమ పాత్రల్లో అలరించారు. నివేదా పేతురాజ్, నివేదా థామస్ ఇద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారు. నివేదా థామస్ చాలా బాగా నటించింది. ఇక మిగితా వారంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.



వివేక్ సాగర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సందర్భానుసారంగా పాటలు వచ్చి వెళ్తుంటాయి. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ అలరించింది. కెమెరా వర్క్ సినిమాకు న్యాచురల్ ఫీలింగ్ తెచ్చింది. కథ, కథనాల్లో దర్శకుడు వివేక్ ఆత్రేయ తన ప్రతిభ కనబరిచాడు. సినిమాకు మాటలు బాగా రాసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత కావాలో అంత పెట్టారు.



ఆల్రెడీ మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన వివేక్ ఆత్రేయ సెకండ్ ప్రయత్నంగా తీసిన సినిమా బ్రోచేవారెవరురా.. కామెడీగా మొదలై.. క్రైం థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా కథ, కథనాల్లో దర్శకుడి టాలెంట్ తెలియచేస్తుంది. సినిమాలో ప్రతి అంశాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా రాస్తుకున్నాడు.


యూత్ ఆడియెన్స్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా వారిని మెప్పిస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా సరదాగా నడిపించాడు. క్లైమాక్స్ కొంత నిరాశకలిగిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు మాత్రం ఈ సినిమా పెద్దగా రుచించకపోవచ్చు. సినిమాలో నటించిన వారంతా తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.        


బడ్జెట్ తక్కువే అయినా సబ్జెక్ట్ కు ఎంత అవసరమో అంత బడ్జెట్ కేటాయించారని చెప్పొచ్చు. మెంటల్ మదిలోతో సక్సెస్ అందుకున్న వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా సినిమాతో ఆ సక్సెస్ కొనసాగించేలా ఉంది.     



శ్రీ విష్ణు, నివేదిత థామస్, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణబ్రోచేవారెవురా యూత్ ఫుల్ ఎంటర్టైనర్..!

మరింత సమాచారం తెలుసుకోండి: