సందీప్ కిషన్, మ్యూజిక్, థ్రిల్లర్ సీన్స్సందీప్ కిషన్, మ్యూజిక్, థ్రిల్లర్ సీన్స్స్క్రీన్ ప్లే, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
రిషి (సందీప్ కిషన్),  దియా (అన్య సింగ్) భార్యాభర్తలు. ఇద్దరు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురవుతుంది. అప్పటి నుండి వారు అద్దంలో చూసుకుంటే వేరే వాళ్లు కనబడతారు. ఇంతకీ వీళ్ల బదులు అద్దంలో కనిపించేది ఎవరు. వాళ్లకు వీళ్లకు సంబంధం ఏంటి..? అసలు రిషి, దియాలు ఎందుకు అలా కనబడతారు..? అసలు కథ ఏంటన్నది సినిమాలో చూడాల్సిందే.



రిషి పాత్రలో సందీప్ కిషన్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్స్ లో సందీప్ నటనకు మంచి మార్కులు పడతాయి. హీరోయిన్ అన్య సింగ్ బాగా కోపరేట్ చేసింది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. వెన్నెల కిశోర్, పోసాని, మురళి శర్మ తమ పాత్రలకు తగినట్టుగా నటించారు.



థమన్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. రిరికార్డింగ్ లో తమన్ మరోసారి అదరగొట్టాడు. హర్రర్ సీన్స్ లో బిజిఎం ఇంప్రెస్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగా కుదిరింది. హర్రర్ సినిమాకు కావాల్సినట్టుగా కెమెరా వర్క్ ఉంది. కార్తిక్ రాజు కథ బాగున్నా కథనంలో కాస్త బోర్ కొట్టించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు కావాల్సినంత బడ్జెట్ పెట్టేశారు.



తెలుగులో హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. కార్తిక్ రాజు రాసుకున్న కథ బాగున్నా కథనంలో ఇంప్రెస్ చేయలేకపోయాడు. కథనంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేసినా సెకండ్ హాఫ్ అసలు కథ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.


సినిమాకు బలం కావాల్సిన ఫ్లాష్ బ్యాక్ అంశాలు అంతగా మెప్పించలేదు. అప్పటిదాకా ఆడియెన్స్ ను బాగానే ఎంగేజ్ చేసిన ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఇంప్రెస్ చేయలేకపోయాడు. అయితే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అంతా సినిమాకు ప్లస్ అవడంతో ఓకే అనిపిస్తుంది. 


ఇక ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కన్నా కేవలం ఈ రకమైన జానర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ నచ్చొచ్చు. అయితే సినిమా ప్రీ రిలీజ్ లో సందీప్ కిషన్ సినిమా పక్కా హిట్టు.. కొత్త ప్రయత్నం అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పిన రేంజ్ లో అయితే సినిమా లేదు. 



సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిషోర్, ఎస్ తమన్నిను వీడని నీడను నేనే.. అంచనాలను అందుకోలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: