ఈ ఏడాది కలిసివచ్చినట్లుగా దీపికా పడుకొనే కు ఏ సంవత్సరం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం విడుదల అయిన మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో దీపిక కలెక్షన్స్ స్థాయి 600 కోట్లు పై మాటే అంటున్నారు. మొదట్లో దీపికకు నటన రాదు అంటూ విమర్శించిన బాలీవుడ్ విమర్శకులు, ఇప్పుడు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీపావళి కి విడుదల కాబోతున్న సంజయ్ లీలా బన్సాలి ‘రామ్ లీలా’ సినిమాలో దీపిక అందాల ఆరబోతను చూసి బాలీవుడ్ షేక్ అయిపోతోంది.

ఇప్పటికే 5 కోట్ల వరకూ భారీ పారితోషికాన్ని తీసుకుంటున్న దీపిక క్రేజ్ మాయలో బాలీవుడ్ టాప్ హీరోలు అంతా ఆమె వెంట పడుతున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో తనతో సినిమాలు చెయ్యాలి అని ఆలోచించుకొనే మధ్య తరగతి బాలీవుడ్ నిర్మాతలకు దీపిక ఒక క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా తనను మంచి కధతో వచ్చి సినిమా తీస్తాను అంటే తాను ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న కోట్లు ఇవ్వక్కరలేదని, సినిమా పూర్తి అయిన తరువాత వచ్చే బిజినెస్ లో షేరింగ్ ఇస్తే చాలు అని చెపుతోంది దీపిక.

సామాన్యంగా బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు లాంటి సెలబ్రిటీలు మన దక్షిణాది కి సంబంధించి రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్లు ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. కాని ఒక హీరోయిన్ ఇలా తన నిర్మాతలకు షేరింగ్ ఆఫర్ ఇచ్చిన సందర్భాలు గతంలో లేవు. ఈ విషయంలో ఇలాంటి షేరింగ్ ఆఫర్ ఇస్తూ మరో కొత్తరకం బాలీవుడ్ రికార్డులను దీపిక సృష్టిస్తోంది అంటూ బాలీవుడ్ మీడియా కధనాలు రాస్తూ దీపిక ఇమేజ్ ను మరింత పెంచేస్తోంది. ఏది ఏమైనా దీపిక హవా ఇప్పుడు బాలీవుడ్ అంతా ఒక వైరల్ ఫీవర్ లా వ్యాపించి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: