మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు పూజ హెగ్డేల కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ వాల్మీకి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్లు సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసాయి. అయితే ఆ అంచనాలను నేడు రిలీజ్ అయిన సినిమా చాలావరకు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల్లో ఎక్కువమంది గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ తన పెర్ఫార్మన్స్ ని అదరగొట్టారని అంటున్నారు. 

ఇక తమిళ హిట్ మూవీ జిగర్తాండను కొంతవరకు మార్పులు చేసి దర్శకుడు హరీష్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే హరీష్ శంకర్ సినిమాల నుండి ఎక్కువగా ప్రేక్షకులు ఆశించే డైలాగ్స్, మాస్ యాక్షన్ వంటివి ఈ సినిమాలో మరింతగా అదిరిపోవడంతో మెజారిటీ ప్రేక్షకులు సినిమా సూపర్బ్ గా ఉందంటూ  ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాకు కొంత లెంగ్త్ ఎక్కువ అవడం, అలానే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొద్దిపాటి బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ, ఓవర్ ఆల్ గా ఈ సినిమా మంచి హిట్ అని మార్కులేస్తున్నారు. కేవలం వరుణ్ మాత్రమే కాక హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, సత్య, తమిళ నటుడు అధర్వ, మృణాళిని రవి, సుప్రియ పాఠక్ వంటివారు తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసారని అంటున్నారు. 

ఇకపోతే సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు మెయిన్ అసెట్ అని, ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అని చెప్తున్నారు. ఇక హోల్ సమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మెజారిటీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో గద్దలకొండ గణేష్ సినిమా యూనిట్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. నిజానికి ఈ సినిమా టైటిల్ ని నిన్న కోర్టు ఉత్తర్వుల మేరకు గద్దలకొండ గణేష్ గా మార్పు చేసిన సమయంలో, సినిమా యూనిట్ కొంత ఆందోళన పడినప్పటికీ, ఫైనల్ గా నేటి సినిమా రిజల్ట్ సక్సెస్ఫుల్ గా ఉండడంతో యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: