డిసెంబర్ 25న విడుదలైన 'మత్తు వదలరా' చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీ‌సింహా. కీరవాణి పెద్దకుమారుడు కాళభైరవ కూడా ఈ చిత్రం ద్వారానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. ఈయన ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి రితేష్ రానా దర్శకత్వం వహించగా.. వెన్నల కిషోర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం 'మత్తు వదలరా' సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఈ చిత్రంపై మండిపడుతున్నారు. దానికీ సరైన కారణాలున్నాయి.

 

రితేష్ రానా 'మత్తు వదలరా' సినిమాలోని అన్ని సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు కానీ బాలకృష్ణ వాయిస్ ని యూజ్ చేసుకొని అతన్ని చులకనగా చూసారని అభిమానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయమేంటంటే మత్తు వదలరా చిత్రంలో చిరంజీవిని పొగుడుతూ ఆకాశానికెత్తిన రితేష్ రానా... బాలయ్య ఇమేజ్ ని డామేజ్ చేయడంతో ఫాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి.


గతంలో బాలయ్య బాబు మేము సైతం ఈవెంట్ లో భాగంగా 'నీ కంటి చూపుల్లో నా ప్రాణం చేరిందే' అనే ఒక పాటని ఆలకించారు. అయితే, బాలకృష్ణ పాటని ఈ సినిమాలోని ఒక ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మాజీ ఫోన్ రింగ్ టోన్ గా సెట్ చేసి చూపించాడు రితేష్. బ్రహ్మాజీ ఫోన్ రింగ్ అవ్వగానే బాలయ్య పాట వినిపించడంతో, థియేటర్ లో ఉన్నవారంతా పకపకా నవ్వుతున్నారు. అదే విధంగా మళ్ళీ ఈ సినిమాలోనే హాస్యనటుడైన సత్యతో సీనియర్ ఎన్.టీ రామారావు వేషాలను వేయించి నవ్వులు పండిస్తాడు రితేష్. ఇలా చేయడం పెద్దాయనని కించపరిచనట్లే అని నందమూరి అభిమానులు రితీష్ ని తప్పు పడుతున్నారు. ఏదేమైనా ఈ సన్నివేశాలని కేవలం వినోదం కోసమే చేసానని రితేష్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: