టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి పేరున్న అతి పెద్ద కుటుంబాల్లో మెగాస్టార్ ఫ్యామిలీ కూడా ఒకటి. మొదటి నుండి తన సహచర నటులను సైతం సొంతవారుగా భావించి, అందరినీ ఎంతగానో కలుపుకుపోయే మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఇతర సినిమా ప్రముఖలకు కూడా ఎంతో ప్రేమ, అభిమానం. మెగాస్టార్ అనంతరం ఆయన ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తొలి సారిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుని ముందుకు సాగిన పవన్ కళ్యాణ్, తన టాలెంట్ తో ఎన్నో గొప్ప విజయాలు, పేరు ప్రఖ్యాతలు గడించారు.

ఒకానొక సమయంలో అన్నయ్య మెగాస్టార్ నే మించిపోయేంతలా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాణ్, ఆపై పవర్ స్టార్ గా మెగా ఫ్యాన్స్ తో పాటు ఎందరో ప్రేకకుల గుండెల్లో గొప్ప స్థానం దక్కించుకున్నారు. టాలీవుడ్ లో బడా స్టార్ హీరోగా ప్రస్తుతం ఎంతో ఎత్తులో ఉన్న పవన్ కళ్యాణ్, తన ఎదుగుదలకు జన్మనిచ్చిన తల్లితండ్రులతో పాటు, అన్న వదినలైన చిరంజీవి, సురేఖ కూడా ముఖ్య కారణం అని చెప్తుంటారు. అలానే తన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, వారు తనకు అండగా ఉండి అందించిన ఓదార్పుని ఎప్పటికీ మరిచిపోలేనని అంటుంటారు పవన్. 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పిన సమయంలో అన్నయ్య వెంట నడిచిన పవన్, ఇటీవల కొన్నేళ్ల క్రితం జనసేన పేరుతో సొంతగా పార్టీ ని నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య దూరం పెరిగిందని, ఇక ఇటీవల కొన్ని పరిస్థితుల కారణంగా ఆ దూరం మరింతగా పెరిగిందని అంటున్నారు కొందరు సినీ వర్గాల వారు.


మొన్నటి ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్యెల్యే గా పోటీ చేసిన పవన్ కళ్యాణ్, పరాజయం పాలవడంతో మెగాస్టార్ కూడా లోలోపల కొంత ఆవేదన చెందారని, -రాజకీయాల్లోకి వెళ్లడం తాను చేసిన పొరటపాటని భావిస్తున్న తరుణంలో పవన్ సొంతంగా పార్టీ పెట్టడం, ఎన్నికల్లో పోటీ చేయడం చిరుకు ఇష్టం లేదనేది మరొక వాదన. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారట మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల వారు. ఎంత అన్నదమ్ములైనా, ఎవరికి వారికి ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలు ఉంటాయి, అలానే ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తుంటారు. అలానే ఎవరికి వారికి ప్రత్యేకంగా భార్య, పిల్లలతో కూడిన కుటుంబం ఉంటుంది కదా, అందునా ఇటీవల కరోనా కారణంగా అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన కారణంగా, వారిద్దరూ ఎక్కువగా కలవడం కుదరలేదని, అయినప్పటికీ, ఎప్పటికప్పుడు ఒకరినొకరు ఫోన్ లో పలకరించుకుంటూనే ఉంటారని, వీటిని దూరం నుండి చూసే వారు, వాళ్ళిద్దరి మధ్యన ఏవో గొడవలు ఉన్నాయి అంటూ తప్పుగా వార్తలు రాయడం సరైనది కాదని వారు అంటున్నారట ...... !!!!

మరింత సమాచారం తెలుసుకోండి: