సాధారణంగా ఫోర్బ్స్ ప్రతి యేటా ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితా విడుదల చేస్తుంది. ఇప్పుడు ఏ పి హెరాల్డ్ అందిస్తున్న ఆ జాబితా మీకోసం చూడండి.

ఇక మంగళవారం ఫోర్బ్స్ పత్రిక  విడుదల చేసిన ఈ జాబితాలో ప్రముఖ రెజ్లర్, నటుడు డ్వేన్ జాన్సన్ అలియాస్ రాక్ మొదటి స్థానంలో వున్నాడు. అతను జూన్ 1, 2019 నుండి జూన్ 1, 2020 వరకు 87.5 మిలియన్లు సంపాదించాడు. ఓటిటి ప్లాటుఫారంలో విడుదలైన రెడ్ నోటీసు చిత్రంలో నటించడానికి 23.5 మిలియన్ డాలర్లుతో సహా కలిపి ఫోర్బ్స్ తెలిపింది. అండర్ ఆర్మర్ ఇంక్ కోసం తన ప్రాజెక్ట్ రాక్ ఫిట్నెస్ వేర్ లైన్ నుండి కూడా అతను ప్రయోజనం పొందాడట.

ఫోర్బ్స్ ర్యాంకింగ్‌లో రెడ్ నోటీస్ లో నటించిన రాక్ హనటుడు ర్యాన్ రేనాల్డ్స్ 71.5 మిలియన్ల డాలర్ల తో రెండవ స్థానంలో నిలిచాడు. అతను రెడ్ నోటీసు చిత్రంకి 20 మిలియన్లు, సిక్స్ అండర్ గ్రౌండ్ చిత్రానికి మరో 20 మిలియన్లు సంపాదించి రెండవ స్థానం లో వున్నాడు.నటుడు మరియు నిర్మాత మార్క్ వాల్బెర్గ్ $ 58 మిలియన్లతో మూడవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో నటులు బెన్ అఫ్లెక్ 55 మిలియన్ డాలర్లు, విన్ డీజిల్ 54 మిలియన్ డాలర్లుతో వరుసగా 4, 5 స్థానాలలో  వున్నారు.

ఫోర్బ్స్ 2020 సంవత్సరానికి అత్యధిక పారితోషికం పొందిన నటుల జాబితాలో టాప్ 10 లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు అక్షయ్ కుమార్.ఈ జాబితాలో అక్షయ్ కుమార్ 48.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 6 వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, నటుడి ఆదాయంలో ఎక్కువ భాగం ఉత్పత్తి ఆమోదాల నుండి వచ్చింది.

ఇక ఈ జాబితాలో అక్షయ్ తర్వాత స్థానాలలో హామిల్టన్ మూవీ సృష్టికర్త లిన్-మాన్యువల్ మిరాండా , నటులు విల్ స్మిత్ 7, 8 స్థానాలలో,  ఆడమ్ సాండ్లర్ 9వ స్థానంలో,  ఇక  మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీ చాన్ 10వ  స్థానంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడ అత్యధిక సంపాదన కలిగిన ఫోర్బ్ స్ 2020 టాప్ 10 నటులు.


మరింత సమాచారం తెలుసుకోండి: