శర్వానంద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ , లావణ్య గ్లామర్ , ఫస్ట్ హాఫ్ శర్వానంద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ , లావణ్య గ్లామర్ , ఫస్ట్ హాఫ్ వీక్ క్లైమాక్స్ , స్క్రీన్ ప్లే , రొటీన్ కమర్షియల్ ఫార్ములా

చిన్నప్పటి నుండి కృష్ణుడి మీద భక్తి భావంతో అతను చూపించిన మార్గంలోనే నడిచే రాధాకృష్ణ (శర్వానంద్) చిన్నప్పుడు ఆపద సమయంలో కృష్ణా అని పిలిస్తే ఓ పోలీస్ వచ్చి కాపాడాడని తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు. ఇక తన ధైర్య సాహసాలను మెచ్చి డైరెక్ట్ గా ఎస్.ఐ పోస్ట్ ఇస్తారు. పోస్టింగ్ వరంగల్ లో వేయగా అక్కడ తన మనసుకి నచ్చిన రాధని చూడగానే ప్రేమిస్తాడు రాధా కృష్ణ.


ఇక అక్కడ తనకు తగ్గ పనిలేదని చెప్పగా వెంటనే ధూల్ పేట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఈ క్రమంలో తర్వాత సిఎం అభ్యర్ధిగా సుజాత (రవి కిశోర్) ను ఎనౌన్స్ చేస్తారు. అది నచ్చని రెడ్డి (ఆశిష్ విద్యార్ధి) సుజాతను ఏదైనా చేయాలని చూస్తాడు. ఇక మరో పక్క సుజాతా తన మీద సింపతీ పెంచుకునేందుకు తన మీద బాంబ్ బ్లాస్ట్ జరిగిందని నమ్మిస్తాడు. ఆ బ్లాస్ట్ లో చాలామంది పోలీసులు చనిపోతారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని తెలిసుకున్న రాధాకృష్ణ సుజాత మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. సుజాతను రాధాకృష్ణ ఎలా ఆడుకున్నాడు..? చివరకు సుజాతాను ఏం చేశారు..? పోలీస్ పవర్ ఎలా చూపించాడు అన్నది అసలు కథ.

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న శర్వానంద్ రాధగా మరోసారి ప్రేక్షకులను మెప్పించేశాడు. ఎలాంటి పాత్రనైనా సరే ఆకట్టుకునేలా చేసే శర్వానంద్ రాధాకృష్ణగా తనలోని కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఇక మాస్ కమర్షియల్ అంశాలకు తేడా రాకుండా చూసుకున్నాడు. ఇక రాధగా లావణ్య బాగానే చేసింది. సినిమాలో ఎన్నడు లేనిది స్కిన్ షోకి ట్రై చేసింది. ఇక మెరుపుతీగలా రుక్మిణి పాత్రలో అక్ష అలరించింది. తణికెళ్ల భరణి పాత్ర అన్ని సినిమాల తండ్రిలానే అలరించింది. ఇక విలన్ రవి కిషన్ బాగా ఆకట్టుకున్నాడు. అందరి ముందు నమ్మకస్తుడిగా మంచివాడిగా నటిస్తూ సిఎం అవడం కోసం చేసే విలనిజం బాగుంది. ఇక కోటా శ్రీనివాస్ రావు, ఆశిష్ విద్యార్ధిల నటన ఆకట్టుకుంది. కమెడియన్స్ సప్తగిరి, శకలక శంకర్ కాసేపు నవ్వులు పండించారు.

దర్శకుడు చంద్ర మోహన్ ప్రతిభ ఆకట్టుకుంది. ఓ పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా వచ్చిన రాధ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. అయితే ఇదే ఫార్ములాతో ఇదివరకే చాలా సినిమాలు చూశామన్న ఫీలింగ్ రాక తప్పదు. కథ పాతదే కథనంలో అక్కడక్కడ కొత్తగా ట్రై చేసినా రొటీన్ ఫార్ములానే అనిపిస్తుంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. కెమెరా మెన్ పనితనం బాగుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత పెట్టాలో అంత పెట్టేశారు. 

ఓ కమర్షియల్ హిట్ ఫార్ములాతో వచ్చిన సినిమా రాధ. సక్సెస్ లో ఉన్న శర్వానంద్ జోష్ ను మరింత పెంచేందుకు రాధ సహకరిస్తుందని చెప్పొచ్చు. అయితే కథ కథనాల్లో రొటీన్ కొట్టుడు కనిపిస్తుంది. శర్వానంద్ నటన కొత్తగా ఉన్నా నడిచే సినిమా అంతా అందరు ఊహించేదిలా ఉంటుంది.

స్క్రీన్ ప్లే విషయంలో డైరక్టర్ చంద్ర మోహన్ కాస్త కన్ ఫ్యూజ్ అయినట్టు తెలుస్తుంది. సేఫ్ జోన్ లో పక్కా మాస్ మూవీగా వచ్చిన రాధ కథ కథనాల గురిచి పక్కనపెడితే టైం పాస్ మూవీగా ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంది. శతమానం భవతి తర్వాత శర్వా ఈ సినిమా చేయడం తన ఇమేజ్ ను పెంచేస్తుంది.

కథలో ఇంకొన్ని ట్విస్టులుంటే బాగుండేది.. మొదట విలన్ ఆశిష్ విద్యార్ధి అనుకోగా అతన్ని డమ్మి క్యారక్టర్ చేయడం ఏం బాగాలేదు. సుజాతా అనే పాత్ర చుట్టే సినిమా మొత్తం తిరగడం హీరో రాధాకృష్ణ సుజాతని ఆటాడుకునేలా చేయడం తప్ప సినిమా సెకండ్ హాఫ్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. మొదటి భాగం కాస్త ఎంటర్టైనింగ్ గా సాగినా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సరదాగా సినిమా చూసేద్దాం అనుకునే వారికి ఇది నచ్చే అవకాశం ఉంది. కాని పెద్దగా చెప్పుకోడానికి ఏమి ఉండదు.
Sharwanand,Lavanya Tripathi,Chandra Mohan,BVSN Prasad,Karthik Ghattamaneniరొటీన్ పోలీస్ పవర్ తో వచ్చిన శర్వానంద్ 'రాధ'

మరింత సమాచారం తెలుసుకోండి: