చిత్రం మొదట్లోనే చిత్రం టార్చర్ పెడుతుందని చెప్పేయడం చిత్రం మొదట్లోనే చిత్రం టార్చర్ పెడుతుందని చెప్పేయడంమొదట్లో చెప్పినట్టే చివరి దాకా చిత్రం ఉండటం

తల్లితండ్రులను కోల్పోయి అనాథలా బతుకుతున్న అమాయకుడు కాకి(రణధీర్), అతనికి ఒక కార్ మరియు ఒక గుర్రం ఉంటుంది వాటిని పెళ్ళిళ్ళకి అద్దెకు ఇస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఒక నిజాయితీ గల లాయర్ ప్రకాష్(జగపతి బాబు), అలానే ఒక నిజాయితీ గల రిపోర్టర్ స్వప్న(భూమిక) వీరిద్దరూ ఒక స్థలం గొడవలో అన్న(గుల్షన్ గ్రోవర్) కి ఎదురు వెళ్తారు. ఇదిలా ఉండగా అందరు తనని ఏడిపిస్తూ ఉండటంతో విసుగు చెందిన కాకి దేవుడిని దూషించి నిద్రపోతాడు మరుసటి రోజు నిద్రలేచే సరికి ఏప్రిల్ ఒకటి ని దాటి వెళ్ళలేడు. నిద్రలేచిన ప్రతిసారి అతను ఏప్రిల్ ఒకటి లోనే ఉండిపోతాడు. అలాంటి సమయంలోనే కాకి , సత్య(సృష్టి) తో ప్రేమలో పడతాడు. అంతేకాకుండా డైమండ్స్ విషయంలో కాకి కోసం వెతుకుతూ ఉంటాడు అన్న, ఇంకా ఇలాంటి విచిత్రమయిన సమస్యల నుండి కాకి ఎలా బయటపడ్డాడు, ప్రకాష్ మరియు స్వప్న అన్నను ఎలా ఎదిరించి గెలిచారు అన్నది మిగిలిన కథ...

రణధీర్ , అమాయకత్వం ప్రదర్శించడానికి ప్రయత్నించిన రణధీర్ ఘోరంగా విఫలం అయ్యారు నిజానికి ఇతని పాత్ర మీద జాలి కలిగించలేకపోవడంలోరణధీర్ వైఫల్యం కనబడుతుంది. జగపతి బాబు విడివిడిగా ఇరవై నిమిషాలు మాత్రమే కనిపిస్తారు ఈ సమయంలో కూడా అతని నటన ఏంటో అతని పాత్ర ఏంటో అర్ధం కాదు. ఇక భూమిక కూడా తక్కువ సమయం ఉండటం ఆమె పాత్రను కూడా సరిగ్గా తీర్చిదిద్దలేకపోవడంతో ఆమె నటన ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి తన అందంతో కాస్త సహాయం అందించగలిగింది భూమిక. ఇక రెండవ కథానాయికగా నటించిన సృష్టి నటనాపరంగా చేసేది ఏం లేదు పాటలకోసం వచ్చి వెళ్ళిపోయే పాత్ర బాగానే పోషించింది ఈ నటి. గుల్షన్ గ్రోవేర్ నటనా పరంగా మంచి నటుడే కాని అయన పాత్రలో అసలు పరిపఖ్వత లేదు అయన నటన కూడా అంతగా ఆకట్టుకోలేదు. తాగుబోతు రమేష్ చేసిన కామెడీ నవ్వించలేకపోయాడు. మిగిలిన పాత్రలు ఏవీ ఆకట్టుకోలేదు.

కృష్ణ స్వామి శ్రీకాంత్ అయ్యంగార్ కథ విషయంలో ఇంగ్లీష్ చిత్రం "గ్రౌండ్ హాగ్ డే" నుండి తీసుకున్నారు కాని కథనం కొత్తగా ఉండాలన్న ప్రయత్నంలో ఏదేదో చేసేసారు నిజానికి ఈ చిత్రం కోసం రాసుకున్న ఇన్ని ట్రాక్స్ లో ఏదో ఒక ట్రాక్ మీద సరిగ్గా పని చేసుంటే కొత్తదనం కూడిన చిత్రం చుసిన ఫీలింగ్ అయిన కలిగి ఉండేది. ఇక కథనం విషయం అయితే సరే సరి ఇంతమంచి కాన్సెప్ట్ కే చాలా మంచి కథనం రాసుకోవచ్చు కాని దర్శకుడు ఏదో మెసేజ్ ఇచ్చేయ్యలన్న తాపత్రయంలో అనవసరమయిన సబ్ ప్లాట్స్ చాలా రాసుకున్నారు. వీటి వల్ల కథ నెమ్మదించడమే కాకుండా విసుగు పుట్టించింది. మాటలు అసలు బాగాలేవు ముఖ్యంగా కీలక సన్నివేశాలలో వచ్చిన మాటల్లో పదును లేకపోవడంతో సన్నివేశాలు తేలిపోయాయి. సినిమాటోగ్రఫీ దారుణంగా ఉంది. సంగీతం అందించిన బంటి రెండు పాటలను మంచిగా అందించగా నేపధ్య సంగీతం విషయంలో ఘోరంగా విఫలం అయ్యాడు. ఈ చిత్రం లో మరో విసుగెత్తించే విషయం నిడివి చిత్రం రెండున్నర గంటలు ఉండటం ప్రేక్షకులకు నీరసం కలిగించే విషయం ఎడిటర్ కాస్త శ్రద్దగా మరో ముప్పై నిమిషాల చిత్రాన్ని కట్ చేసినా పోయేదేమీ లేదు. నిర్మాణ విలువలు బాగోలేవు.

ఏ చిత్రానికి అయినా వెళ్ళే ముందు బాగుంటుందేమో అన్న ఆశతోనే వెళ్తాడు ప్రేక్షకుడు. కాని అటువంటి అమాయకపు ప్రేక్షకుడిని సినిమా పేరుతో హింసించడం మహా పాపం. ఈ చిత్రం అలాంటి కోవకి చెందినదే. నిజానికి ఈ చిత్రం మొదలవ్వకముందే దర్శకుడు తనికెళ్ళ భరణి గారి చేత "మా ఈ హరిబుల్ మరియు టార్చర్ చిత్రానికి వచ్చినందుకు థాంక్స్" అని చెప్పినప్పుడే అర్ధం చేసుకొని బయటపడిన వాడు అదృష్టవంతుడు. ఇదేదో వెరైటీ గా ఉంది సినిమా కూడా అలానే ఉంటుందేమో అని థియేటర్ లో నే ఉండేవారికి నరకం అనే పదానికి ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ నేర్పించాడు. తలా తోక లేని సన్నివేశాలను పదే పదే సాగదీస్తూఎటు వెళ్ళాలోతెలియక ఎటు వెళ్తున్నాడో అర్ధం కాక దర్శకుడు కష్టపడి ప్రేక్షకుడిని కష్టపెట్టాడు. ఇక లాజిక్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. విలన్ హీరో కి తెలియకుండా దాచిపెట్టిన వజ్రాలను తను తీసుకోకుండా అసలు వజ్రాల గురించి తెలియని హీరో ని పదే పదే అడగటంలో అర్ధం ఏంటో ఎవరికీ అర్ధం కాదు. హీరో మరియు హీరోయిన్ ఎందుకు ప్రేమించుకుంటారో వారికయినా తెలుసో లేదో.. సింగల్ టేక్ ఆర్టిస్ట్ , సింగల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ లు ఉన్నారు ఇందులో గుల్షన్ గ్రోవర్ పోషించింది సింగల్ లొకేషన్ పాత్ర. చిత్రం మొత్తం అతను ఒకే లొకేషన్ లో ఉంటాడు. అనవసరమయిన సన్నివేశాలు , పసలేని కథనం , కసి లేని నటన, ఉండాలి కాబట్టి ఉంచిన కామెడీ, నెమ్మదిగా సాగే నేరేషన్, పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఇలా అన్నీ కలిసి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని పెద్ద ఫూల్ ని చేసాయి. ఇంకా కూడా ఈ చిత్రం చూడాలి అనుకునే వారు భూమిక కోసం చుడండి(ఫూల్ అవ్వండి) ... ఫూల్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇంట్లో ఐ పీ ఎల్ చూడండి...

Jagapati Babu,Bhumika Chawla,Krishnaswamy Shrikanth,GL Srinivas.ఏప్రిల్ ఫూల్ - మేలో ఏప్రిల్ ఫూల్ అయిన ప్రేక్షకుడు...

మరింత సమాచారం తెలుసుకోండి: