మెగాస్టార్.. ఈ బరువైన బిరుదు అందుకోవడానికి చిరంజీవి రెండు దశాబ్దాల పాటు చాలా కష్టపడ్డాడని చెప్పాలి. చిరంజీవి గురించి ఇంకో మాట చెప్పుకోవాలి. ఆయన టాప్ ఫోర్ అని తన ముందున్న ఎన్టీయార్, ఏయన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు శకానికి బ్రేక్ వేసి సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు. తనతో మరో కొత్త తరానికి నాంది పలికారు. అందుకే చిరంజీవి గురించి ఓ సందర్భంలో దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ చిరంజీవి పాత తరానికి కొత్త తరానికి వారధి, సారధి అన్నారు.

నిజమే చిరంజీవి గురించి ఇంకో విషయం కూడా ఉంది. చిరంజీవికు ముందు తరువాత అన్నట్లుగా సినిమా పరిశ్రమ ఉంది. అంటే కలెక్షన్ల విషయంలో కూడా సరికొత్త్త రికార్డులు చిరంజీవి స్రుష్టించారు. ఘరానా మొగుడు సినిమా మూడు దశాబ్దాల  క్రితం రిలీజ్ అయింది. అప్పట్లో ఆ సినిమా కలెక్షన్లు పది కోట్లు. దాన్ని చూసి బాలీవుడ్ నోరు వెళ్లబెట్టింది. ఒక రీజనల్ లాగ్వేజ్ సినిమాకు అంత స్టామినా ఉందా అని ఆశ్చర్యపోయింది.

అలా బాలీవుడ్ ని టాలీవుడ్ వైపు చూసేలా చేసిన ఘనత కూడా అచ్చంగా చిరంజీవిదేనని చెప్పాలి. చిరంజీవి ఆ తరువాత ఆ కలెక్షన్ల వరదను పారించుకుంటూనే పోయారు. టాలీవుడ్ భారీ సినిమాలకే కాదు భారీ కలెక్షన్లకు కూడా కేంద్రం అని చిరంజీవి నిరూపించారు. బాక్సాఫీస్ ని గలగలలాడించారు. చిరంజీవి కమర్షియల్ హీరోకు అసలైన డెఫినిషన్ అని కూడా అంటారు.

ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి మొదటి చిత్రం అంటే ప్రాణం ఖరీదు అనుకుంటారు. కానీ చిరంజీవి ఫస్ట్ మూవీ పునాది రాళ్ళు. ఈ సినిమాను చిరంజీవి ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో ఉన్నపుడే చేశారు. అయితే రిలీజ్ లో అది లేట్ కావడం ప్రాణం ఖరీదు 1978లో రిలీజ్ కావడంతో అదే ఫస్ట్ మూవీ అని అంటారు. మొత్తానికి చిరంజీవి లోని స్పార్క్ ని ఆయన కళ్ళను మనవూరి పాండవులు మూవీలో చూసిన బాపు ఆయన గొప్ప నటుడు అవుతారని నాడే అంచనావేశారుట. ఆ తరువాత బాపూ డైరెక్షన్లో కూడా చిరంజీవి హీరోగా మంత్రిగారి వియ్యంకుడు మూవీ చేశారు. ఆయన నాటి లెజండరీఎ డైరెక్టర్లు అందరి వద్ద పనిచేసి రాటు తేలి మెగాస్టార్ గా ఈ తరానికి స్పూర్తిని ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: