మెగాస్టార్ చిరంజీవికి ప్రిన్స్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ చేశారు. మీరు మా జనరేషన్ కు స్ఫూర్తి.  మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఆనందం ఇవ్వాలని కోరుకుంటున్నానని ప్రిన్స్ పోస్టు చేశారు.  చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాను నిర్మాతగా మారుతున్నానని ఆశీర్వదించాలని సుస్మిత కోరారు. నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ట్విటర్ లోని తన ఖాతాలో చిరంజీవితో దిగిన ఫొటోను పోస్టు చేసి హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అని విషెస్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే మళ్లీ మళ్లీ రాబోయే సంవత్సరాల్లో జరుపుకోవాలని కోరారు. మన మెగాస్టార్ చిరుకు ఎనర్జిటిక్ రామ్ బర్త్ డే విషెస్ ను చెప్పారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చిరంజీవికి పుట్టిన రోజు విషెస్ తెలిపారు. దేవీ శ్రీ ప్రసాద్ కూడా విషెస్ చెప్పారు. అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా శంకర్ దాదాజిందాబాద్ ఫొటోను పోస్టు చేసి, మీ పట్ల  గౌరవం నా మదిలో పూర్తిగా నిండి ఉందని తెలిపారు. ఇక సినీ ప్రముఖులు వెంకటేష్, ఇక సినీ ప్రముఖులు వెంకటేష్, అక్కినేని కుటుంబం తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా కొన్ని విషయాలు ..
మెగాస్టార్ చిరంజీవి 1955లో ఆగస్టు 22న కొణిదెల వెంకట్రావు అంజనాదేవిలకు జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూర్ స్వగ్రామం. స్టూడెంట్ గా ఉన్న సమయంలో న్యూఢిల్లీ జరిగిన రిపబ్లిగ్ దినోత్సవం రోజున పారెడ్లో ఎన్ సీసీ  క్యాడెట్ గా పాల్గొన్నారు. స్కూల్ విద్యను నిడదవోలు,  గురజాల, బాపట్ల, పొన్నూరు మంగళగిరి, మొగల్తూర్ ల్లో పూర్తి చేశారు. అలాగే  ఓంగోలులోని  సి.ఎస్.ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసుకున్నారు. నర్సాపూర్ వై ఎన్ కాలేజీలో డిగ్రీని చదివారు. ఆ తర్వాత చెన్నై కు బయలుదేరి మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సులో చేరారు.

1980 ఫిబ్రవరిలో 20న ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కూతుళ్లు సుస్మిత, శ్రీజ, కొడుకు రామ్ చరణ్ కలిగారు. రామ్ చరణ్ తెలుగు సినీ ఇండస్ర్టీలో పెద్ద హీరో నేడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు  నటుడు, నిర్మాతగా ఉన్నారు. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ గా ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇంకా చిరు బావమరిది అల్లు అరవింద్ బడా నిర్మాతగా ఉన్నారు. ఆయన కుమారుడు అల్లు అర్జున్ పెద్ద హీరోగా ఉన్నారు. ఇటీవలె అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

1982 నుంచి 1986లో చేసిన సినిమాలు చిరు కెరియర్ ను మలుపు తిప్పాయి. ఇంటిలో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, సీతా దేవి, ఇదిపెళ్లంటారా, డింగు రంగడు, బంధాలు అనుబంధాలు, మొండిఘటం, పట్నం వచ్చిన ప్రతివ్రతలు మరియు బిల్లా రంగా, మంచు పల్లకి చిత్రాల్లో కీలక పాత్ర పోషించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: