మెగాస్టార్ చిరంజీవి సోదరుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్న పవన్, యువతలో బాగా పేరు సంపాదించారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే అన్నయ్య చిరంజీవికి తగ్గ తమ్ముడిగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని దక్కించుకున్నారు.  

ఇక రెండున్నరేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన పవన్, ఇటీవల వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళి సినిమాలోకి రీఎంట్రీకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఏడవ సినిమాగా వచ్చిన జానీ మూవీకి తొలిసారిగా కథను అందించడంతో పాటు ఆ సినిమా ద్వారా తొలిసారిగా మెగాఫోన్ పట్టారు పవన్. కానీ ఆ సినిమా మాత్రం రిలీజ్ తరువాత ఘోరంగా పరాజయం పాలయింది. అనంతరం కొన్నేళ్ల తరువాత గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే ని అందించారు పవన్. అంతకముందు వచ్చిన గబ్బర్ సింగ్ భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో దీనిపై ప్రేక్షకులతో పాటు పవన్ ఫ్యాన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అనూహ్యంగా రిలీజ్ తరువాత ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.  

ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ తరువాత అక్కడక్కడా కొందరు పవన్ ఫ్యాన్స్ ఆయనను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. హీరోగా మీరు చేసిన సినిమాలు అంటే మాకు ప్రాణం, అలానే హీరోగా మీరు ఎన్నో గొప్ప విజయాలు అందుకుని పేరు గడించారు. కానీ మీరు కథలు రాసిన సినిమాలు మాత్రం సక్సెస్ కావడం లేదంటే ఆ కథల్లో కొంత లోపాలు ఉంటున్నాయని, కాబట్టి ఇకపై మీరు సినిమాల కథలు రాయవద్దు అంటూ వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు అభిమానులు అయితే అన్నా, మీకు రాయాలనిపిస్తే హాయిగా రామకోటి రాసుకోండి, అంతేకాని దయచేసి సినిమా కథలు మాత్రం రాయకండి అంటూ సరదాగా వ్యాఖ్యానించడం జరిగిందని అంటున్నారు విశ్లేషకులు ......!!

మరింత సమాచారం తెలుసుకోండి: