టాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న తన 49వ పుట్టినరోజుని జరుపుకున్నారు. టాలీవుడ్ కి మొదటగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన పవన్ కెరీర్ లో ఆ తరువాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలు భారీ విజయాలు అందుకుని పవన్ కు యువతలో మంచి పేరు తెచ్చిపెట్టాయి. అక్కడి నుండి వరుస అవకాశాలతో మరింతగా దూసుకెళ్లిన పవన్, ఇటీవల జనసేన పేరుతో పార్టీ పెట్టి, ఆ పార్టీ కార్యకలాపాల్లో రెండున్నరేళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు.  

అయితే కొద్దిరోజులుగా తమ హీరో మళ్ళి సినిమాల్లోకి రావాలనే ఫ్యాన్స్ యొక్క అభ్యర్ధనను చివరికి మన్నించిన పవన్, ఇటీవల వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళి ముఖానికి మేకప్ వేసుకున్నారు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో అలానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు పవన్. అయితే వీటిలో పవన్ ఫ్యాన్స్ అందరి మెయిన్ దృష్టి అంతా హరీష్ శంకర్ తో చేయబోయే సినిమా మీదనే ఉంది. గతంలో పవన్ తో హరీష్ తీసిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే, అందువలన ఆయనతో తదుపరి చేయబోయే సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.  

నిన్న పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా కథను హరీష్ ఎంతో పవర్ఫుల్ గా సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఫైట్స్ వంటి అంశాలతో సాగనున్న ఈ సినిమాలో బలమైన మెసేజ్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఆ విధమైన పవర్ఫుల్ ఫార్ములాతో హరీష్ రాసుకున్న ఈ కథ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా పవన్ ఫ్యాన్స్ కు మంచి పండుగ వార్తే అని చెప్పకతప్పదు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: