మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి స్టార్డం ఓ విధంగా చెప్పాలంటే యూత్ లో క్రేజ్ లో ఆయన్ను మించాడనిపించేలా పవర్ స్టార్ క్రేజ్ ఉందని తెలిసిందే. తొలి సినిమ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుండి అజ్ఞాతవాసి వరకు తీసిన పాతిక సినిమాలతోనే పవర్ స్టార్ అంటే ఫ్యాన్స్ అందరు కాలర్ ఎగరేసేలా చేశాడు. పవన్ సినిమా హిట్టైతే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. అయితే పాతిక సినిమాల పవన్ సినిమా ప్రస్థానంలో యూత్ ఆడియెన్స్ ను అలరించే సినిమాలే చేశాడే తప్ప పెద్దగా ప్రయోగాలేమి చేయలేదు పవన్ కళ్యాణ్.

ఎలాంటి ప్రయోగాలు చేయకుండానే పవర్ స్టార్ గా అశేష ప్రేక్షక అభిమానాన్ని పొందాడు పవన్. అయితే ఇప్పుడు రూట్ మార్చాడు పవర్ స్టార్. క్రిష్ డైరక్షన్ లో పవన్ చేస్తున్న సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ ను ఎప్పుడు చూడని కొత్త ప్రీ లుక్ తో చూపించాడు క్రిష్. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికే కాదు సిని ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు.

పవర్ స్టార్ కెరియర్ లో చిరస్థాయిగా నిలిచే సినిమా ఇది అవుతుందని అంటున్నాడు డైరక్టర్ క్రిష్. నిజంగా ఈ సినిమా అదే జరిగితే పవన్  ఇన్నాళ్ళు ప్రయోగాలు చేయలేదు కాబట్టి కొద్దిగా వెనకపడ్డాడు కాని అదే ప్రయోగాలు చేస్తే మాత్రం మిగతా హీరోలకు కొద్దిగా కష్టంగానే ఉండేదని చెప్పొచ్చు.                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: