కాన్సెప్ట్ కాస్త విభిన్నంగా ఉండటం కాన్సెప్ట్ కాస్త విభిన్నంగా ఉండటం మిగిలినవి అన్ని చెత్తగా ఉండటం

సాయి(సాయి రామ్ శంకర్) ఒక ట్రావెల్స్ కి ఓనర్ , చూడగానే చైత్ర(జాస్మిన్) తో ప్రేమలో పడిపోతాడు. అలా చైత్ర ను కూడా తన ప్రేమలో పడేయడానికి తన చుట్టూ తిరుగుతుంటాడు సాయి కాని సాయి పనులకు విసిగిపోయిన చైత్ర సాయి కి ఎలాగయినా బుద్ధి చెప్పాలని అతన్ని అవమానిస్తుంది దాంతో సాయి చైత్ర నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడే సాయి జీవితం లోకి అనుకోకుండా ప్రవేశిస్తుంది సిమ్రాన్(ప్రియదర్శని) ఆమెని కూడా చూడగానే ప్రేమలో పడిపోయిన సాయి ఆమెతో కలిసి తన సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు సాయి జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తుంది చైత్ర, ఒక కృష్ణాష్టమి రోజు చైత్ర మరియు సిమ్రాన్ ఇద్దరు సాయి కి ప్రపోస్ చేస్తారు, సాయి ఇద్దరి ప్రేమని అంగీకరిస్తాడు , కాగా ఇద్దరినీ ఒప్పించి ఎలాగయినా ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని సాయి అనుకుంటాడు ఇదే విషయం చైత్ర మరియు సిమ్రాన్ కి అర్ధం అయ్యేలా చెప్పడానికి బ్యాంకాక్ తీసుకెళతాడు. అక్కడ ఎం జరిగింది? వీళ్ళిద్దరూ సాయి చెప్పినదానికి ఒప్పుకున్నారా? ఇద్దరి లో సాయి ఎవరో ఒకరినే పెళ్లి చేసుకున్నాడా లేదా ఇద్దరినీ చేసుకున్నాడా? ఇలాంటి ప్రశ్నలు ఏదయినా ఉంటె జవాబుకు థియేటర్ లో దొరుకును....

సాయి రామ్ శంకర్, బంపర్ ఆఫర్ తో హిట్ కొట్టిన ఈ నటుడు ఎటువంటి పాత్ర ఇచ్చినా అదే రకమయిన నటన కనబరుస్తున్నాడు. పాత్రల పేర్లు మారుతున్నాయి కాని తీరు మారట్లేదు. ఇంకా సెంటిమెంట్ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సన్నివేశాల దగ్గర ఈ నటుడు తేలిపోయాడు. ఇక చైత్ర పాత్రలో కనిపించిన జాస్మిన్ అందంగా కనిపించడమే కాకుండా క్యూట్ గా హావభావాలను ప్రదర్శించింది, ఈ పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో మరింత అందం చేకూరింది కాని కీలక సన్నివేశాలలో సరైన హావభావాలను ప్రదర్శించలేక పోయింది ఈ భామ, ఇక రెండవ కథానాయిక సిమ్రాన్ పాత్రలో చేసిన ప్రియదర్శిని సరిగ్గా ఆకట్టుకోలేకపోయింది కొన్ని సన్నివేశాలలో మాత్రమే తన అందంతో ఆకట్టుకుంది. ప్రగతి చేసింది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో ఆకట్టుకోగలిగింది. చంద్రమోహన్, ఎం ఎస్ నారాయణ అప్పుడప్పుడు నవ్వించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు నెల్లూరు గిరి నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ చిత్రం లో బ్రహ్మానందం లేరు కాని ఉన్నారు అన్నట్టుగా ఉంది ఈయన పాత్ర కనిపిస్తుంది కాని కవ్వించదు. మిగిలిన నటులందరు ఏదో ఉన్నాం అనిపించారు...

పదేళ్ళ క్రితమే పాతబడిపోయిన కథని దుమ్ము దులిపి మనముందుకి తీసుకొచ్చాడు దర్శకుడు "ఆయనకి ఇద్దరు" , " అల్లరి ప్రియుడు" , "ఆవిడా మా ఆవిడే" , " బద్రి" వంటి చిత్రాల కథే ఈ చిత్రానికి కథ. కథ పాతది అని తెలిసిపోయిన దర్శకుడు కథనం కొత్తగా రాయలనుకున్నాడు కాని కొత్తగా రాయాలన్న ప్రయత్నం కనిపిస్తుందే కాని సన్నివేశాలు కొత్తగా లేవు. ఇది చాలదు అన్నట్టు అసలు వేగం లేని కథనం, బొత్తిగా క్లారిటీ లేని క్లైమాక్స్ ఇలా చాలా అంశాలు ఇబ్బంది పెట్టేవే .. డైలాగ్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ పాటల వరకు బాగుంది, కాని కొన్ని సన్నివేశాలలో కావలసిన మూడ్ సృష్టించలేకపోయింది. ఎడిటింగ్ లో ఎగుడు దిగుడు లు ఉన్నాయి , వీటి వల్ల ఫ్లో చాలా డిస్టర్బ్ అయ్యింది. శేకర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది కాని నేపధ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు పరవాలేదు.

త్రికోణ ప్రేమకథ అనుకుందాం అంటే ఆ ఛాయలు కనపడలేదు, ఇతను ఇద్దరినీ ప్రేమిస్తాడు ఇద్దరు ఇతన్ని ప్రేమిస్తారు ఇది సరళ రేఖ ప్రేమ కథ అని అనుకోవచ్చు. కాని రెండు వైపులా ముగింపు లేని ఈ రేఖ ఎంత దూరం వెళ్ళింది అన్న క్లారిటీ దర్శకుడికి అయినా లేదు. విషయం ఏంటంటే నిజమే ఇది కొత్త కాన్సెప్ట్ కొత్తగా డీల్ చెయ్యాలని అనుకున్నాడు దర్శకుడు కాని కొత్తదనం ఎక్కడా కనిపించకుండా కొత్తగా చెప్తే కొత్తగా ఎలా ఉటుంది అనేది అర్ధం చేసుకోలేకపోయారు. హీరో ఇద్దరినీ ప్రేమించాలి కాబట్టి పాత సన్నివేశాలకే కాస్త న్యూ టచ్ ఇచ్చి వాడేసారు. సరే ఇద్దరు ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఇద్దరినీ ఒప్పించాలి ఇండియా లో అయితే లొకేషన్స్ బాగోవు అనుకోని బ్యాంకాక్ పోయారు. పోనీ అక్కడికి వెల్లడం వల్ల ఒరిగింది ఏమయినా ఉందా అంటే ఎం లేదు, అక్కడ చిత్రంలో ట్విస్ట్ చెప్పేశారు ఇకనయినా ప్రేక్షకుల గురించి ఆలోచించి తన పాయింట్ తొ వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు అనుకుంటే అక్కడ నుండి కూడా అదే సోది, చెప్పే విషయంలో క్లారిటీ లేనప్పుడు ఎన్నిసార్లు అదే విషయాన్నీ తిప్పి తిప్పి చెప్పినా అర్ధం కాదు ఈ పాయింట్ దర్శకుడు అర్ధం చేసుకోలేకపోయాడు. మొదటి అర్ధ భాగం పరవలేధనిపించాగా రెండవ అర్ధ భాగం అసలు బాగోలేదు. ఇంతకు ముందు తీసిన కాన్సెప్ట్ ని మళ్ళీ తీసాడు కాని సరిగ్గా తీయలేకపోయాడు కాబట్టి ఇదే కాన్సెప్ట్ ని ఇంకోసారి తీసి ఈసారి అయినా సరిగ్గా తీస్తారేమో చూడాలి. చివరిగా నాదొక ప్రశ్న ఈ చిత్రానికి దీని టైటిల్ కి సంభంధం ఏంటి?? ... ఈ వారం విడుదలయిన చిత్రాలలో ఇది పరవాలేదు అని చెప్పుకోడం తప్ప ఈ చిత్రం గురించి ఇంతకన్నా ఎక్కువ ఎం చెప్పలేము... ఇక చూడాలా వద్దా అన్నది మీ నిర్ణయం...

Sai Ram Shankar,Jasmine,Priyadarsini,Jay Ravindra,K Venu Gopal.చివరగా : దిల్లున్నోడు : విషయం లేనోడు ...

మరింత సమాచారం తెలుసుకోండి: