తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి ఒక బ్రాండ్ అన్న విషయం తెలిసిందే.. కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చిన అతి కొద్ది మందిలో చిరు ఒకరు. ఎక్కడో మారు మూల ప్రాంతం నుంచి వచ్చి స్టూడియో ల వెంట చెప్పులు అరిగేలా తిరిగి ఒక్క ఛాన్స్ కోసం అలుపెరగని బాటసారిగా వేల సార్లు తిరిగారు. చైన్నలోని ఫిలిం ఇండస్ట్రీలో డిగ్రీ ని పొందాడు.ఆ తర్వాత 1978 లో పునాది రాళ్ళు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆరంగ్రేటం చేశారు. అయితే ఆ సినిమా కన్నా ముందు ప్రాణం ఖరీదు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన జీవితం ఇప్పుడు అందరికీ ఒక పాఠ్యాంశం అయింది. ఇండస్ట్రీలో వస్తున్న యువ హీరోలు అంతా ఆయననే ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే చిరు స్థాయి ఏ రేంజులో ఉంటుందో చూడండి.. ఇకపోతే చిరంజీవి ఎన్నో సినిమాలలో నటించిన ఘనత చిరంజీవికి ఉంది. ఇకపోతే చిరంజీవి గతంలో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండి, రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పేరుతో పార్టీని స్థాపించి. కొన్నేళ్లు మంత్రిగా పదవి భాద్యతలు స్వీకరించి, ప్రజలకు సేవలు చేశారు. తర్వాత మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.


ఖైదీ నంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు..ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఆ తర్వాత సైరా సినిమాలో నటించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ను అందుకుంది. భారీ హిట్ తో పాటుగా మంచి టాక్ ను కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలు నటిస్తున్నాడు.ఆ సినిమానే ఆచార్య. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా చిరు నటించిన స్టాలిన్ సినిమా నేటికీ 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. మంచి మెసేజ్ ను అందించిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.త్రిష, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ మాదిరిగా ఈ సినిమా హిట్ అనే చెప్పాలి. ఇలాంటి ఎన్నో మైలు రాయిలను చిరు దాటుకొని స్టార్ హీరో అయ్యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: