టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తొలితరం సూపర్ స్టార్ గా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ కొన్నేళ్ల నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. మనదేశం సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా రంగప్రవేశం చేసిన ఎన్టీఆర్, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని తన సినిమాల్లోని పాత్రల ద్వారా తెలుగు ప్రజల మనస్సులో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక ఆయన అనంతరం తేనెమనసులు సినిమాతో చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో కొనేళ్లపాటు నెంబర్ వన్ గా కొనసాగారు.
గూఢచారి 116తో కమర్షియల్ గా అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకున్న కృష్ణ, తన కెరీర్ మొత్తంలో 350కి పైగా సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా తెలుగు ప్రజల మన్ననలు అందుకోవడం జరిగింది. ఆయన అనంతరం తరువాత తరంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తొలిసారిగా ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత పునాదిరాళ్ళు, మనవూరి పాండవులు మొదలుకుని ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నరసింహారెడ్డి వరకు మొత్తంగా తన సినీ ప్రయాణంలో కొన్నేళ్ల పాటు తిరుగులేని నెంబర్ వన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గొప్ప పేరు దక్కించుకున్నారు. అయితే చిరంజీవి తరువాత వచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారు ప్రస్తుతం బడా స్టార్స్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. అయితే వీరిలో పక్కాగా నెంబర్ వన్ హీరో ఎవరు అనేది చెప్పడం ఒకరకంగా కష్టం అని అంటున్నారు విశ్లేషకులు.
అయితే ముఖ్యంగా ఇటువంటి పోటీ వచ్చిన ప్రతి సారి ముందుగా వినపడే పేర్లు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, క్రేజ్ పరంగా అలానే పాపులారిటీ, మార్కెట్ ల పరంగా అన్ని ప్రాంతాల్లో సమానమైన ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్స్ ఇద్దరూ ఒకరకంగా నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా ఉంటారని, అయితే ఇటీవల వరుస సక్సెస్ లతో ఎన్టీఆర్, అలానే పాన్ ఇండియా రేంజ్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ కూడా మంచి పేరు దక్కించుకోవడంతో వారికి కూడా ఈ రేస్ లో స్థానం దక్కిందని, అయితే వీరు నలుగురిలో పక్కాగా నెంబర్ వన్ ఎవరు అనేది తెలియాలి అంటే మాత్రం మరికొన్నేళ్లు సమయం పట్టవచ్చని వారు అంటున్నారు ....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: