బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలి అనుకునే వారికే కాదు ఎలాంటి రంగంలో అయినా ఒక టార్గెట్ పెట్టుకుని ఒక రేంజ్ కు ఎదగాలని కష్టపడే వారందరికీ ఇన్స్పిరేషన్ కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్ అదేనండీ మన చిరంజీవి. ఈ మాటలు అనడంలో ఎటు వంటి అతిశయోక్తి కాదు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఆయన కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకుని మెగాస్టార్ అయ్యారు. సౌత్ లో కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకున్న మొదటి నటుడిగా ఆయన ఆరోజుల్లోనే కొత్త రికార్డు క్రియేట్ చేశారు.ఈరోజు ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్  అయింది. అది కూడా సరిగ్గా నలభై రెండేళ్ళ క్రితం.  

1978 సెప్టెంబ‌ర్ 22న విడుద‌లైన ప్రాణం ఖరీదు సినిమా నేటితో 42 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రావు గోపాల్ రావు చేసిన తప్పుకు జయసుధ, చంద్ర మోహన్ చనిపోతారు.  పేదోడి ప్రాణం ఖరీదు 25 రూపాయలు అని సినిమా చివర కైకాల సత్యనారాయణ చెప్పే మాటలు చాల మందికి అప్పట్లో మేలుకొలుపు అని చెప్పచ్చు. చివరికి రావు గోపాల్ రావు చిరంజీవి చేతిలో చనిపోతాడు. చిరు   నలభై రెండేళ్ళ  సినీ ప్రయాణంలో ఎన్నో హిట్స్ , బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అలానే ఎన్నో ఫ్లాప్స్, మరెన్నో డిజాస్టర్స్ ఉన్నాయి.

కానీ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమా రిలీజవుతుందంటే థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొనేది. సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల‌లోకి వెళ్లారు. దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ ఇచ్చినా చిరంజీవి స్టామినా ఏమాత్రం తగ్గలేదని 'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో ప్రూవ్ చేసారు. ఇక ఆయన ప్రస్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆచార్య'గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు మన మెగాస్టార్.



మరింత సమాచారం తెలుసుకోండి: