టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దాదాపుగా రెండున్నర దశాబ్దాలపాటు తిరుగులేని స్టార్ హీరోగా కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. తొలి సినిమా ప్రాణం ఖరీదు తో టాలీవుడ్ కి నటుడిగా అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత పునాదిరాళ్లు, మన ఊరి పాండవులు వంటి సినిమాల్లో నటించారు అనంతరం పలు సినిమాల్లో విలన్ వేషాలు కూడా వేసి, ఆపై హీరో గా మారి వరుస సినిమాలు చేస్తూ కొనసాగారు.

అయితే సరిగ్గా 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హీరోగా పెద్ద బ్రేక్ ను అందుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత నుండి సుప్రీం హీరోగా, ఆపై మెగాస్టార్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న చిరంజీవి వరుస విజయాలతో మరింత క్రేజ్ సంపాదించారు. తన ఆకట్టుకునే యాక్టింగ్, డ్యాన్సింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ వంటి వాటితో కోట్లాదిమంది మనసుల్లో మెగాస్టార్ గా చెరగని ముద్ర వేసిన చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా చూడాలని ఎందరో ప్రేక్షకులు తపిస్తూ ఉంటారు. అప్పట్లో ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి.

అత్యధిక పారితోషికం అందుకున్న తొలి తెలుగు హీరోగా అలానే కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న హీరోగా కూడా గొప్ప రికార్డ్ ని సొంతం చేసుకున్న చిరంజీవి సినిమా ఏ సమయంలో అయినా బాక్సాఫీస్ బరిలో నిలుస్తుంది అంటే దాని ముందు ఎటువంటి రికార్డ్స్ అయినా సరే తల వంచాల్సిందే. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి యువ హీరోలు మంచి క్రేజ్ తో ముందుకు సాగుతున్నప్పటికీ మెగాస్టార్ క్రేజ్ మాత్రం కొద్దిగా కూడా తగ్గలేదని ఇటీవల వచ్చిన ఆయన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ భారీ సక్సెస్ దానికి కారణం అంటున్నారు విశ్లేషకులు.  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరు, దాని రిలీజ్ అనంతరం దానితో కూడా బ్లాక్ బస్టర్ సాధించి పలు రికార్డ్స్ తో సెన్సేషన్ సృష్టించడం ఖాయమని అంటున్నారు. అలానే ఎన్నేళ్లు గడిచినప్పటికీ కూడా మెగాస్టార్ చిరు సినిమా క్రేజ్ మాత్రం తగ్గదని వారు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: