టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కలిసి ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ ఆ ఇద్దరూ కలిసి ఒకసారి వెండి తెరపై కనిపిస్తే చాలు అనేటువంటి కోరిక అటు వారిద్దరి అభిమానులతో పాటు కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల మనసులో కూడా ఉంది. మొదటగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా సినిమా అవకాశాలు అందుకుంటూ వాటిని సక్సెస్ లుగా మలచుకుని గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన పవన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఇక ఈ రెండు సినిమాల పై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైన సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు. అక్కడి నుండి వరుసగా ఆఫర్ల తో కొనసాగిన సూపర్ స్టార్ ఇటీవల కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు అందుకుని మంచి జోష్ మీద ఉన్నారు. ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇకపోతే ఇటీవల కొద్ది రోజుల క్రితం తన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ లో భాగంగా మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేసిన పవర్ స్టార్, లాయర్ డ్రెస్ లో మాస్కు పెట్టుకొని కనిపించడం జరిగింది. ఆయన ఫోటోలు మొన్నటినుంచి పలు మీడియా మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఇక పోతే నిన్న తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళిన మహేష్ బాబు ఫోటోలు కూడా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా  వీరిద్దరి ఫోటోలను జత చేస్తూ ఒకే ఫోటోగా రూ పొందించిన కొందరు అభిమానులు వాటిని పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. పవన్, మహేష్ కలిసి ఒకే సినిమాలో నటించనప్పటికీ వారిద్దరూ కలిసి ఉన్న ఆ ఫోటో మాత్రం ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో బాగా చెక్కర్లు కొడుతుంది..... !!


మరింత సమాచారం తెలుసుకోండి: