ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సుప్రియ యార్లగడ్డ అక్కినేని కుటుంబం వారసురాలుగా "అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి" చిత్రంతో  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసింది. వీళ్లిద్దరికీ ఇది ఫస్ట్ సినిమా. హీరోయిన్ గా మంచి కెరీర్ ఉన్నా కానీ సుప్రియ ఈ ఒక్క సినిమాతోనే ఫుల్స్టాప్ పెట్టేసింది. చాలా సంవత్సరాల తరువాత అడివి శేష్ "గూఢచారి" చిత్రంతో మళ్ళీ నటిగా ఎంట్రీ ఇచ్చింది. సుప్రియ వ్యక్తిగత విషయాలు ఎవరికీ తెలియవు. గూఢచారి సినిమా టైంలో సుప్రియ అడివి శేష్ ని ప్రేమించిందని అతన్నే పెళ్లి కూడా చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ తరువాత అడివి శేష్ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పేసాడు. ఇవన్నీ పక్కన పెడితే... సుప్రియకు పెళ్లయిందని, ఆమె భర్త కూడా ఒక హీరోనే అని తెలుసా..?


అతనెవరో కాదు.... నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన చరణ్ రెడ్డి... ‘ఇష్టం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. హీరోయిన్ గా శ్రియ సరన్ నటించింది. విలక్షణ దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌ ఈ సినిమాకి దర్శకుడు. వీరి ముగ్గురికి ఇదే మొదటి సినిమా. అయితే ఈ చిత్రం నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చినా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. దీంతో చరణ్ రెడ్డికి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకు సంబంధించి ఎలాంటి విషయం బయటకు రాలేదు. కానీ ఆకస్మాత్తుగా 2012, మార్చి 19న చరణ్ చనిపోయాడు. అప్పటికే సుప్రియ, చరణ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.


గుండెనొప్పి రావడంతో చరణ్‌ను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారని, ఆ వెంటనే మళ్లీ గుండె నొప్పి రావడంతో చనిపోయాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కుటుంబ కలహాల కారణంగా చరణ్ మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడని, అతడిని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయి చనిపోయాడని షాకింగ్ నిజాలు తెలిసాయి. చరణ్ అక్కినేని కుటుంబానికి అల్లుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. తనకు సినీ అవకాశాలు లేకపోయినా, ఇతర ఇబ్బందుల్లో ఉన్నా ఎప్పుడూ ఆ ఫ్యామిలీ పేరు వాడకపోవడం ఆయన మంచితనానికి నిదర్శనమని తెలిసినవారు చెబుతూ, అతని మంచితనాన్ని గుర్తూ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: