థియేటర్‌లో బొమ్మ పడితే సినిమా హిట్టో ఫట్టో చెప్పేయొచ్చు. మరి ఓటీటీలో రిలీజైతే. సక్సెస్‌ అయిందో.. ఫెయిల్‌ అయిందో తెలుసుకోవడం ఎలా? ఓటీటీ యాజమాన్యం లెక్కలు బైటకు చెబితేగానీ.. రిజల్ట్‌ తెలీదు. కానీ.. వాళ్లు చెప్పకపోయినా.. ఎన్ని నిమిషాలు స్ట్రీమింగ్ అయిందో తెలిస్తే.. ఫలితం చెప్పేయొచ్చు. ఈలెక్కన  బాగుందన్న టాక్‌ వచ్చిన కలర్‌ఫొటో ఓటీటీని మెప్పించిందా.. ఆకాశమే నీ హద్దురా పరిస్థితి ఏంటనే దానిపై ఇపుడు సందేహాలు నెలకొన్నాయి.

సుహాస్‌, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం 'కలర్‌ఫొటో'. సుహాస్‌ కమెడియన్‌గా పరిచయమేగానీ.. హీరోగా ఇదే ఫస్ట్‌ మూవీ. దర్శకుడు సందీప్‌ రాజ్‌కు క్రేజ్‌ లేదు. అయితే.. సినిమా టీజర్స్‌.. సాంగ్స్ సినిమాకు హైప్‌ తీసుకొచ్చాయి. దీనికి తోడు ఓటీటీ ఆహా చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇది సినిమా హైప్‌కు ఉపయోగపడింది. దీనికి తోడు.. బాగుందన్న టాక్‌ రావడంతో.. కలర్‌ ఫొటో టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది.

కలర్‌ఫొటోకు ఎన్ని వ్యూవ్స్‌ వచ్చాయో చెప్పలేదుగానీ.. ఆహాలో ఇప్పటిదాకా రిలీజైన కొత్త సినిమాలన్నింటిలో అత్యధిక వ్యూస్ ఈ సినిమాకే వచ్చాయని తెలిసింది. అలాగే కలర్‌ఫొటో తర్వాత ఆహాకు కొత్త సబ్‌ స్కైబర్స్‌ పెరిగారట. కలర్‌ఫొటో 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమ్ అయినట్లుగా పోస్టర్‌ రిలీజ్ చేశారు. సినిమా నిడివి 2 గంటల 21 నిమిషాలు. ఒక్కొక్కరు పూర్తి నిడివిని ప్లే చేసిన ప్రకారం చూస్తే.. ఈ చిత్రానికి మూడున్నర లక్షల వ్యూస్ వచ్చినట్లు లెక్క. ఓటీటీ వ్యూస్ అన్నీ టికెట్లుగా మారకపోయినా.. థియేటర్లలో రిలీజై ఉంటే.. సగటు టికెట్ ధర రూ.100 అనుకుంటే మూడున్నర కోట్లు వచ్చేది.

కలర్‌ఫొటోను కోటిన్నర బడ్జెట్‌తో తీశారని.. ఓటీటీలో సినిమాకొచ్చిన టాక్‌ ప్రకారం చూస్తే..  థియేటర్స్‌లో 10 కోట్లు వచ్చేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్‌ వర్గాలు.  ఎంత తక్కువగా వేసుకున్నా7 కోట్లు వచ్చేదని.. సినిమాకు హైలైట్‌గా నిలిచిన నటీనటులు.. దర్శకుడు..మ్యూజిక్‌ డైరెక్టర్‌కు మరింత క్రేజ్‌ వచ్చేది. డిస్టెన్షన్‌ రాకపోయినా.. ఓటీటీలో ఫస్ట్ క్లాస్‌ మార్కులు తెచ్చుకుంది కలర్‌ఫొటో యూనిట్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: