ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి సినిమాలు చేసి హిట్లు కూడా అందుకున్నారు. కాని మెగా వారసురాలు నిహారిక మాత్రం నటిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేకపోయిందని చెప్పాలి. తొలినాళ్లలో ఈ మెగా బ్రదర్ కూతురు చాలా వెబ్‌సిరీస్‌ల్లో నటించి ఆపై యాంకర్‌గానూ సత్తా చాటింది. ఢీ డాన్స్ షో ద్వారా యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. తరువాత నటిగా నిరూపించుకోవడానికి యంగ్ హీరో నాగశౌర్య సరసన ‘ఒక మనసు’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయినా నిహారికకు మాత్రం నటిగా మంచిపేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో నిహారిక సినిమాలను దూరం పెట్టి వెబ్‌ సిరీస్‌ల బాట పట్టింది. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ కనిపించినా అంత ప్రాముఖత ఉన్న పాత్ర కాదు.మూడు సినిమాల్లో నటించినా హిట్ కొట్టలేకపోయిన నిహారిక చేజేతులా ఓ మంచి హిట్ సినిమాను వదులుకుందన్న విషయం చాలామందికి తెలియదు.

ఇటీవల ఆహా యాప్ ద్వారా విడుదలై సంచలన విజయం సాధించిన ‘కలర్ ఫోటో’లో హీరోయిన్ పాత్రకు మొదట నిహారికనే సంప్రదించిందట యూనిట్.కానీ కరోనా టైమ్‌లో రిస్క్ చేయడం ఎందుకని భావించి ఆమె ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. దీంతో యూనిట్ చాందిని చౌదరిని తీసుకున్నారట.ఆ సినిమా విజయం సాధించడంతో పాటు హీరోయిన్ చాందిని చౌదరి, హీరో సుహాస్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ పాత్ర నిహారిక చేస్తే ఆమెకు మంచి పేరు రావడంతో పాటు కెరీర్లో ఓ హిట్ పడేది. అయితే తానే చేజేతులా మంచి ఆఫర్‌ వదులుకున్నానని నిహారిక ఇప్పుడు బాధపడుతోందట.

బహుశా దురదృష్టమంటే ఇదేనేమో... ఆ సినిమా చేసుంటే మెగా ఫ్యామిలీ నటిగా తనకంటూ ఓ గుర్తింపు సాధించేది..ఇక సినిమాలకు ఫుల్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకొని స్థిరపడిపోవాలని అనుకుంటుందట నిహారిక.. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్ల గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విశేషాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: