టాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మన తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత వరుసగా పలు సినిమాలతో భారీ విజయాలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అతి పెద్ద హీరోగా కొనసాగుతున్న పవన్ తో ఒక్క సినిమా చేయాలని ఎందరో దర్శకనిర్మాతలు ఆశపడుతూ ఉంటారు.

ఆ విధంగా ప్రేక్షకులు, అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఏ విధంగా తప్పుగా మాట్లాడినా ఆయన అభిమానులు మాత్రం అస్సలు ఊరుకోరు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల ఒక తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో భాగంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గురించి అలానే ఆయన జనసేన పార్టీ గురించి కొంత సంచలన వ్యాఖ్యలు చేసారు. దానితో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ లో ప్రకాష్ రాజ్ పై కొంత వ్యతిరేకత వెల్లువెత్తింది. పలువురు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ పై విమర్శలు కామెంట్స్ రూపంలో ఎక్కుపెట్టడం జరిగింది. అయితే ఈ విషయమై నేడు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నేను ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీని ఉద్దేశించి మాట్లాడినవే తప్ప తనకు ప్రత్యేకంగా పవన్ అంటే ఎటువంటి విద్వేషాలు లేవని, తనతో కలిసి ఎన్నో సినిమాలో పని చేసిన తనకు ఆయనతో మంచి మిత్రత్వం ఉందని, సినిమా పరిశ్రమలో మేమిద్దరం ఎంత మంచి మిత్రులమో అదే విధంగా రాజకీయాల విషయమై భిన్నమైన సరళి కలిగిన వ్యక్తులం అని, అందువలన తనకు జనసేన, పార్టీ బిజెపికి మద్దతు ఇవ్వడం సరైనది కాదనిపించే అలా వ్యాఖ్యానించానని అన్నారు. వాస్తవానికి తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని, నేను అన్నది ఒకటి అయితే వాళ్ళు అర్ధం చేసుకున్నది వేరొకటని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: