టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభము అయిన మెగాస్టార్ నట జీవితం అక్కడి నుండి అంచెలంచలుగా ఎదుగుతూ ముందుకు సాగింది. అయితే ఆ తరువాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా ద్వారా తొలిసారిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న చిరంజీవి అక్కడి నుండి వెనుకకు తిరిగి చూసుకోలేదు. ఆపై సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా టాలీవుడ్ లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందుకోవడంతో పాటు ఒకానొక సమయంలో యావత్ భారతదేశంలోనే అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా గొప్ప రికార్డు ని దక్కించుకున్నారు. ఇకపోతే మెగాస్టార్ కెరీర్ లో హీరోగా ఎదుగుతున్న రోజుల్లో అప్పటి సీనియర్ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృషంరాజు వంటి వారు ఆయనను వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు ఇప్పటికీ మెగాస్టార్ పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు.

ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ వంటి వారు అయితే చిరంజీవిని తమ సోదరుడిగా భావించి ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకునేవారని, అలానే ఆయన మెగాస్టార్ గా గొప్ప క్రేజ్ దక్కించుకున్న అనంతరం నిజమైన టాలెంట్ కి తమ తరువాతి తరంలో చిరంజీవి చిరునామాగా నిలిచి మంచి స్థాయికి ఎదిగారు అని ఆయనని కొనియాడేవారట. నిజానికి చిరంజీవి ఎదుగుతున్న సమయంలో బాలయ్య, నాగార్జున, వెంకటేష్ సహా మరికొందరు అప్పటి యువ నటులు కూడా రేస్ లో ఉన్నప్పటికీ, వారందరినీ మించేలా తన ఆకట్టుకునే యాక్టింగ్, డ్యాన్సింగ్, టాలెంట్ తో చిరంజీవి మరింత ముందుకు దూసుకెళ్లారు.

ఇక అప్పట్లో మెగాస్టార్ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్, అలానే ఆపై వచ్చిన కలెక్షన్స్ ఎప్పటికీ మరిచిపోలేం అని ఇప్పటికే కొందరు మెగా ఫ్యాన్స్ వాటిని గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ ల గురించి చెప్పుకోవాలంటే ఒకటా రెండా, ఆయన కెరీర్ లో ఎన్నో గొప్ప సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయనే చెప్పాలి. వాస్తవానికి మధ్యలో కొన్నాళ్ళు కొంత ఫ్లాప్స్ ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆపై మళ్ళి పుంజుకున్న చిరంజీవి ఇప్పటికీ కూడా అదే క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య వచ్చే ఏడాది సమ్మర్ లో పేక్షకుల ముందుకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: