టాలీవుడ్ బడా హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం చిరంజీవి తరువాత నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా ఉన్న నటులు అనే విషయం తెలిసిందే. కొన్నేళ్ల నుండి తమ సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రతి సినిమాతో మరింత పేరు ప్రఖ్యాతలు అందుకుంటున్న ఈ ఇద్దరు స్టార్స్ కూడా నాలుగు పదుల వయసు పైబడిన వారు అనే విషయం తెలిసిందే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్, రాజకుమారుడు మూవీతో మహేష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ తోలి సినిమాలతోనే నటులుగా ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్నారు.
ఇక అక్కడి నుండి ఎవరికి వారు సినిమాలు చేస్తూ అనతికాలంలోనే గొప్ప క్రేజ్ ని కోట్లాదిమంది ప్రేక్షకుల, అభిమానుల ప్రేమని చూరగొన్నారు. ఇకపోతే అసలు మ్యాటర్ ఏమిటంటే ప్రస్తుతం వీరిద్దరి తనయలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ గా మారారు. పవర్ స్టార్ తనయుడు అకీరా, సూపర్ స్టార్ తనయుడు గౌతమ్ కృష్ణ ఇద్దరూ కూడా ప్రస్తుతం యుక్త వయసులో ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా ఇద్దరూ కూడా ఎంతో భారీ హైట్ ఉండడంతో అందరి దృష్టి వారి మీదనే ఉంది. ఇక వీరు బయట ఎక్కడ ఏ ఫంక్షన్ లో మెరిసినా అక్కడి వారందరిలో వీరు ఒకింత ప్రత్యేకంగా కనపడుతున్నారు.
వయసు రీత్యా గౌతమ్ కంటే అకీరా కొంత పెద్దవాడు. అయినప్పటికీ కూడా ఇద్దరూ భారీ పొదగర్లు కావడంతో ఇప్పుడే వీరు ఇంత హైట్ ఉన్నారంటే, ఇక మరింత వయసు పెరిగితే ఇంకెంత పొడుగు పెరుగుతారో అంటూ పలువురు అభిమానులు మరియు ప్రేక్షకులు ఒకింత ఆసక్తిని కనబరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వీరిద్దరూ ప్రస్తుతం ఎవరికి వారు చక్కగా చదువుకొంటుండగా, రాబోయే రోజుల్లో వీరిలో ఎవరు సినిమాల్లోకి వస్తారో చూడాలి. మొత్తంగా ఈ విధంగా అటు సూపర్ స్టార్, ఇటు పవర్ స్టార్ ల తనయులు ఇద్దరూ కూడా తమ తండ్రులకు తగ్గ తనయులుగా ఇప్పటినుండే మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: