బాహుబలి సినిమాతో యావత్ సినీ ప్రేక్షకుల ఆదరణను సంపాదించాడు డార్లింగ్ ప్రభాస్. ఈ సినిమాతో ఈ హీరో రేంజే మారిపోయింది. వరుసగా పాన్ ఇండియా  సినిమాలను ఓకే చెప్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. మైథలాజికల్ మూవీగా  తెరకెక్కుతున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. భారీగా కంప్యూటర్ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు తాజాగా శ్రీకారం చుట్టారు మేకర్స్. ఈ విషయాన్ని స్వయానా ఆరడుగుల అందగాడు డార్లింగ్ ప్రభాస్ మంగళవారం ఉదయం ప్రకటించారు.
కాగా ప్రభాస్ మోషన్ క్యాప్చర్ టీంతో కలిసి దర్శకుడు ఓం రౌత్ దిగిన ఒక ఫోటోను కూడా డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియా వేధికగా షేర్ చేశాడు. దీనికి‘ మోషన్ క్యాప్చర్ స్టార్ట్ అయ్యింది.. ఆదిపురుష్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు’ అని  పోస్ట్ లో రాసారు హీరో ప్రభాస్. అయితే ఇలాంటి మోషన్ క్యాప్చర్ ని ఇంతకు ముందు అవతార్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ సినిమాలకు ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. కాగా రజినీ కాంత్ నటించిన రోబో, కొచ్చాడియన్ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీనే వాడారు. ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మోషన్ క్యాప్చర్ సూట్ ను మనుషులకు వేసి వారికి సెన్సార్లను అటాచ్ చేస్తారు.


వాటిని ధరించిన మనుషులతో యాక్టింగ్ చేయిస్తారు. ఆ మోషన్ క్యాప్చర్ ద్వారా మూమెంట్స్ ను కంప్యూటర్ లో రికార్డ్ చేస్తారు. దీనికి సంబంధించిన పనులే తాజాగా  ప్రారంభం అయ్యాయి. ఆదిపురష్ సినిమాలో ఒరిజినల్ షాట్స్ కంటే వీఎఫ్ఎక్స్ షాట్సే ఎక్కువగా ఉంటాయిని ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియజేసింది. అన్నట్టుగానే మోషన్ క్యాప్చర్ మొదలయ్యింది. కాగా ఈ  టెక్నాలజీని ఉపయోగించడానికి ఈ చిత్ర యూనిట్ భారీ బడ్జెట్ నే కేటాయించిందట. కాగా ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా పోస్టర్ ను చూసిన ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పట్ల భారీ అంచనాలే పెట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: