కరోనా కరువు కాలంలో ఆపద్బాంధవుడు గా మారి  ‘రియల్‌ హీరో’గా నీరాజనాలు అందుకుంటున్న నటుడు సోనూ సూద్‌ కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన ఆయనకి నిరాశే మిగిలింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) నోటీసులను వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టు లో పిటిషన్ వేశారు నటుడు సోనూసూద్‌. అయితే ఇక్కడ కూడా ఆయనకు చుక్కెదురయింది. సోనూ పిటిషన్ ను బాంబేే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి పృథ్వీ రాజ్ చవాన్ నిరాకరిస్తూ కొట్టి వేశారు. ముందు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా  అక్కడ కూడా ఇలాగే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు సోనూ.

హైకోర్టు లో అయినా తన సమస్య  తీరుతుంది అని భావించిన సోనూ కు ఇక్కడా నిరాశే మిగిలింది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టానికి వ్యతిరేకంగా  కమర్షియల్‌ లాభాలు పొందడానికి అడ్డ దారిలో వెళ్తున్నారు అంటూ సోనూసూద్‌ పై బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. కాగా ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్తుల భవనాన్ని ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఈ నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ అధికారులు నోటీసులు పంపించగా... అన్ని అనుమతులు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు సోనూసూద్.

కాగా సోనూసూద్ ఇచ్చిన పిటిషన్ ను తాజాగా బాంబే హైకోర్టు తిరస్కరించింది.  దీంతో ప్రముఖ నటుడు సోను సూద్ ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అన్న అంశంపై సర్వత్ర ఉత్కంట నెలకొంది. ఓవైపు ప్రజలు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను సోనూ సూద్ కు బ్రహ్మరధం పడుతుంటే... మరోవైపు ఆయన ఇటువంటి సమస్యల్లో చిక్కుకోవడం పట్ల ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనూ సూద్ ప్రతిపాదనకు తిరస్కారం తెలుపుతూ నోటీసులు జారీ చేసింది హైకోర్టు .


మరింత సమాచారం తెలుసుకోండి: