ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఠాగూర్ మధు సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పోతురాజు వీరశంకర్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపంచిన ఈ సినిమా ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని అలరిస్తోంది. థమన్మూవీ కి అందించిన సాంగ్స్ తో పాటు మరీ ముఖ్యంగా ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా విశేషంగా ప్రశంసిస్తున్నారు.

గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని తమ హీరోకి ఒక్కసారిగా ఇంత భారీ హిట్ రావడంతో మాస్ రాజా ఫ్యాన్స్ లో అమితానందం వెల్లివిరుస్తోంది అనే చెప్పాలి. ఇక దాదాపుగా టాలీవుడ్ లోని పలు ఇతర హీరోల అభిమానులు కూడా తమ హీరో సినిమాకు మంచి పాజిటివ్ టాక్ అందించారని వారు అంటున్నారు. ముఖ్యంగా హీరో రవితేజ నటనతో పాటు విలన్ గా నటించిన సముద్రఖని, దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ మూవీ సక్సెస్ లో ముఖ్య భూమికలు పోషించారు. రెండు వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ మూవీకి చాలా ఏరియాల్లో స్టడీగానే కొనసాగుతోందని, తప్పకుండా మరికొద్దిరోజులు ఈ మూవీ ఇదే ఊపుని కొనసాగించే అవకాశం కనపడుతోందని పలువురు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఈ సినిమాని ఈ నెల 29న ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అది నిజమేనేని, కానీ ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో బాగా రన్ అవుతుండడంతో, తమ ఓటిటి లో రిలీజ్ ని మరొక వారం రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 5 న రిలీజ్ చేస్తాం అంటూ కొద్దిసేపటి క్రితం ఆహా వారు ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసారు. దీనితో క్రాక్ మూవీ ఓటిటి లో చూద్దాం అనుకున్న వారికి కొంతవరకు నిరాశ కలిగిందని, అయినప్పటికీ సినిమా కలెక్షన్స్ దృష్టిలోపెట్టుకుని ఆహా వారు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అనేది కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: