అవకాశాలు రావాలే కానీ హీరోయిన్లు ఏడాదికి ఎన్నైనా సినిమాలు చేసే అవకాశం ఉంది.  వాళ్లకు పాత్రనిడివి తక్కువ. పైగా యాక్షన్ సీన్స్ ఉండవు. పెద్దగా వర్కవుట్ చేయాల్సిన అవసరం ఉండదు.  ఇక హీరోల విషయానికి వస్తే ఒక్క సినిమాతో సరిపెట్టేస్తున్నారు. మరీ అయితే రెండో సినిమా కథ విని.. ఓకే చెప్పడం లాంటివి చేస్తుంటారు. చిన్నహీరోలు  రెండు సినిమాలు మహా అయితే మూడు సినిమాలు చేస్తేనే గొప్పగా చెప్పుకుంటారు. 80వ దశకంలో అయితే అప్పటి హీరోలు ఏడాదికి పదికి పైగా చేసేవాళ్లు. ఈ విషయంలో మాత్రం హీరో కృష్ణని చెప్పుకోవాల్సిందే. ఆయన సినీ పరిశ్రమలో పనిచేసే వారికోసమని ఎక్కువ సినిమాలు సైన్ చేసేవారట. అలాంటిది ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పెద్ద హీరోలయితే ఒక్క సినిమాతో సరిపెట్టేస్తున్నారు. అభిమాన హీరో సినిమా ఎప్పుడొస్తుందా అని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి.

అలాంటిది మళయాళ నటుడు పృథ్వీ రాజ్ మాత్రం వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు. అతను చేయబోయే సినిమాల లిస్ట్ వింటే .. ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం 30 సినిమాలకు ఒకే చెప్పాడట. ఇప్పుడు ఇదే విషయం సినీపరిశ్రమ లో హాట్ టాపిక్ అయ్యింది. పృథ్వీ రాజ్ ఇన్ని సినిమాలు చేస్తున్నాడా.. అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అదంతా అబద్ధం లే అన్నవాళ్లూ లేకపోలేదు. అయితే నిజమేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. 30 సినిమాలకు కమిట్ అవ్వడమేకాదు.. కొన్ని సినిమాలకు టైటిల్ ఫిక్స్ అయ్యాయి. మరి కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కొన్నింటికయితే కాల్షీట్స్ కూడా ఇచ్చేశాడు. వీటిల్లో ఏ ఒక్క సినిమాను వదిిిలే ఛాన్సే లేదంటున్నాడు పృథ్వీరాజ్. మొత్తం 30 సినిమాల్లో ఈ ఏడాది కనీసం 10 సినిమాలైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి పృధ్వీరాజ్ రికార్డ్ బీట్ చేసే వాళ్లు ఎవరైనా ఉన్నారా..  చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: