సాధారణంగా రచయితలు కథ రాసుకున్న తర్వాత ఆ కథకు తగ్గట్టుగా టైటిల్ నిర్ణయించుకుంటారు. అయితే కొన్ని చిత్రాలు టైటిల్ని బట్టి సంపాదించుకుంటాయి. టైటిల్ ఎంత బాగుంటే,ఆ సినిమా అంతా అయినట్టు లెక్క. అయితే ఇక్కడ కొన్ని సినిమాల పేర్లను ఏకంగా  ఊరి పేర్లు పెట్టేసి సినిమాలు తీశారు . అలా ఊరి పేర్లే, సినిమా టైటిల్ గా వచ్చి, ప్రేక్షకుల ముందు  కొన్ని హిట్.. కొన్ని ఫట్..అయ్యాయి. అయితే ఆ సినిమాలో ఏంటో తెలుసుకుందాం..


1. అనంతపురం :
తమిళ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం అనంతపురం. ఇక ఈ చిత్రంలో కొంటె చూపుతో అనే పాట బాగా హిట్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.

2.  బొంబాయి:
మణిరత్నం తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం. ఈ చిత్రంలో అరవిందస్వామి,మనీషా కొయిరాలా జంటగా నటించారు. ఈ సినిమాకి ఊరు పేరు పెట్టడం విశేషం.

3.  అరుణాచలం:
సుందర్.సి దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్  హిట్ అయింది. తమిళనాడులో ఓ ఊరిపేరే ఈ సినిమాకు పెట్టారు.

4. భద్రాచలం :
శ్రీహరి హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో పుణ్య స్థలమైన భద్రాచలం పేరుమీదుగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బాగా హిట్ అయింది.

5. అయోధ్య :
కృష్ణ, వడ్డే నవీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాముడు జన్మస్థలమైన అయోధ్య అని పేరు పెట్టారు.అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

6.  తెనాలి:
గుంటూరు దగ్గర ఒక ఊరి పేరు పెట్టారు. ఈ చిత్రంలో కమల్ హాసన్  నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేదు.

7. శ్రీ శైలం :
శ్రీ హరి హీరోగా నటించిన ఈ చిత్రానికి కూడా ఊరి పేరు పెట్టారు. అయితే ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది.

8. భీమిలి కబడ్డీ జట్టు :
నాని నటించిన ఈ చిత్రానికి వైజాగ్ దగ్గర భీమిలి ఊరు పెట్టారు. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు.

9. బెజవాడ :
నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయవాడ పేరు పెట్టారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

10. అన్నవరం :
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పుణ్య క్షేత్రం అయిన అన్నవరం పేరు పెట్టారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఇంకా హనుమాన్ జంక్షన్, కులుమనాలి, కేరాఫ్ కంచరపాలెం, రేణి గుంట, ద్వారక, గంగోత్రి, సింహాచలం, భద్రినాథ్, కాశీ, తిరుపతి ఇలా ఎన్నో చిత్రాల టైటిల్స్ కు ఊరి పేర్లు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: