టాలీవుడ్ కి చెందిన స్టార్ యాక్టర్ రామ్ చరణ్, త్వరలోనే తను స్టార్ట్ చేసిన విమానయాన సంస్థ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రామ్‌చరణ్‌ తేజకు సంబంధించిన 'టర్బో మేఘా' కంపెనీ త్వరలోనే సేవలందించనుంది. మరో వారం రోజుల్లో ఈ కంపెనీకి డీజీసీఏ నుంచి తుది అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు ఆ సమాచారం.

దీంతో ఆ కంపెనీ అఫీషియల్‌గా విమానయాన సేవలు ప్రారంభించవచ్చు. ఇప్పటి వరూ తెలుగు కంపెనీల్లో ఒక్క ఎయిర్ కోస్టా మాత్రం విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇక ఎయిర్‌ కోస్టా తర్వాత టర్బో మేఘా విమానాయాన సేవలందిస్తున్న రెండో తెలుగు కంపెనీగా చెప్పవచ్చు. మొదట టర్బో మేఘా నుంచి మూడు విమానాలతో తిరుపతి, రాజమండ్రి,వైజాగ్‌, విజయవాడ  అలాగే బెంగళూరు నగరాలకు విమానాలను నడపనున్నారు.

రామ్‌చరణ్‌ తేజ్‌ ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉండటంతో టర్బో మేఘాకు బాగా కలిసొచ్చే అంశమే. చెర్రికి మొదటినుంచి కూడా విమానయాన రంగంపై ఆసక్తి ఉండటంతోనే టర్బో మేఘాతో చేతులు కలిపారని  ఆయన కంపెనీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టర్బో మేఘా పైలెట్లను, ఎయిర్‌హోస్టెస్‌ తదితర సిబ్బందిని కూడా రిక్రూట్‌ చేసుకుందని, 

ఇక మే మధ్య నుంచి టర్బో మేఘా కంపెనీ విమానయాన సేవలందిస్తుందని సమాచారం. తను స్టార్ట్ చేయబోతున్న కంపెనీ లాభాల్లో ఉండేందుకు ఏ విధంగా ప్రణాళికను రూపొందించాలనన్న విషయంపై ఇప్పటికే తను ఓ డాక్యుమెంటేషన్ ని రెడీ చేసుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: