సినిమాలలో నటించే హీరో హీరోయిన్స్ మాత్రమే కాకుండా రచయితలు కూడ కోట్ల రూపాయలలో పారితోషికాలు తీసుకుంటున్న వార్తలను విన్నాం. ప్రముఖ రచయితలు కోన వెంకట్, వక్కంతం వంశీ లాంటి స్టార్ రైటర్స్ ఇప్పటికే తమ కథలకు కోటి రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు అనే వార్తలు ఉన్నాయి. 

అయితే లేటెస్ట్ గా పూరి జగన్నాథ్ ఛార్మీతో తీస్తున్న ‘జ్యోతిలక్షి’ కథను ఒక ప్రముఖ నవలా రచయితకు కేవలం ఒక లక్ష రూపాయలు పారితోషికంగ ఇచ్చి పూరి ఆ కథను అత్యంత చౌకగా కొట్టేసాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.

1980 ప్రాంతంలో ప్రముఖ నవలా రచయితగా అలనాటి పాఠకులను ఒక ఊపు ఊపిన మల్లాది కృష్ణముర్తి వ్రాసిన ‘మిసెస్ పరాంకుశం’ నవలను ఆధారంగా చేసుకుని పూరి ఈ ‘జ్యోతిలక్ష్మి’ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నవలకు పారితోషికంగా లక్ష రూపాయలు మాత్రమే పూరి మల్లాదికి ఇచ్చినట్లు వస్తున్న వార్తలను బట్టీ పూరీ ఎంత తెలివిగా ఈ వ్యవహారం నడిపాడు అనే విషయం ఆశ్చర్యాన్ని కలుగ చేస్తోంది.

ఈమధ్య జరిగిన ‘జేమ్స్ బాండ్’ ఆడియో వేడుకలో అతిధిగా వచ్చిన వీరు పోట్ల ఆ సినిమా దర్శకుడు సాయి కిషోర్ గురించి మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే సాయి కిషోర్ కోటి రూపాయల పారితోషికం తీసుకున్నాడు అని షాకింగ్ న్యూస్ చెప్పిన నేపధ్యంలో ‘జ్యోతిలక్ష్మి’ కథను ఎంత చౌకగా పూరీ సంపాదించాడో అర్ధం అవుతుంది. అందువల్లనే ఎవరికీ పడని చిరంజీవి పూరి బుట్టలో పడ్డాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: