వెండితెరపై నటించే నటులు అదే మొదటిసారి అవ్వాలని రూల్ లేదు. అంతక ముందు యూ ట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న నటుల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.బ్రహ్మోత్సవం, మను, ఇటీవల వచ్చిన కలర్ ఫోటో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. అందులో మధురం షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు.

అర్జున్ రెడ్డి, కల్కి, హుషారు, గీత గోవిందం ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన రాహుల్ రామకృష్ణ, సైన్మా షార్ట్ ఫిలింలో నటించారు. ఈ షార్ట్ ఫిలిమ్ కి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.విజయ్ సేతుపతి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగులో ఎంతో పాపులర్ అయ్యారు. కెరియర్ ప్రారంభంలో విజయ్ సేతుపతి షార్ట్ ఫిలింస్ లో నటించారు. కల్కి, బ్రాండ్ బాబు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన పూజిత పొన్నాడ కూడా అను తను నేను, పరిచయం, దీపికా పదుకొనే ఇంకా ఎన్నోషార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.

ప్రతిరోజు పండగే, మజిలీ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి, ఇటీవల కలర్ ఫోటో ద్వారా హీరోగా మన అందర్నీ అలరించిన సుహాస్ అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అందులో అతిధి షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు, అలాగే అతిధి షార్ట్ ఫిలింలో తన పెర్ఫార్మెన్స్ కి ఎందరో సెలబ్రిటీల నుండి ప్రశంసలు అందుకున్నారు. పెళ్లిచూపులు, కేశవ సినిమాల్లో నటించిన రీతు వర్మ, అనుకోకుండా అనే షార్ట్ ఫిలిం నటించారు.

ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్, హిట్ సినిమాలతో పాపులర్ అయిన విశ్వక్ సేన్ పిట్టకథ అనే షార్ట్ ఫిలిం లో నటించారు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఒక తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా వేరే భాష ఇండస్ట్రీలలో కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షార్ట్ ఫిలిం లో నటించారు. ఇక ఉయ్యాల జంపాల, రాజుగాడు, కుమారి 21ఎఫ్, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన రాజ్ తరుణ్ అంతకు ముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: