మొదట్లో మంచి హిట్ లు కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో ఫేడ్ అవుట్ అయిపోతున్నాడు.. రీసెంట్ గా వచ్చిన ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే సినిమా లు కూడా ఫ్లాప్ గా తేలిపోవడంతో రాజ్ తరుణ్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇప్పుడు చేయబోయే సినిమా హిట్ కొడితే తప్ప హీరోగా నిలివలేని పరిస్థితి ఉంది.. ఈ నేపథ్యంలో అయన కొత్త సినిమా పోస్టర్ అందరిని ఆసక్తి ని రేకెత్తిస్తుంది. ఉయ్యాల జంపాల సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ కుమారి 21F తో కుర్రాడు కాదు టాప్ హీరో అవుతాడు అన్నారు..  మూడో సినిమా సినిమా చూపిస్త మావ కూడా సూపర్ హిట్ అవడంతో రాజ్ తరుణ్ టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు

కానీ అందరి అంచనాలు తారుమారు అయన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి.. సరిగ్గా మళ్ళీ మూడు సినిమాలు చేశాక కానీ రాజ్ తరుణ్ స్టఫ్ ఏంటో తెలుసుకోలేకపోయారు.. మధ్య లో చాల సినిమాలు చేసిన రాజ్ తరుణ్  ఒరేయ్ బుజ్జిగా సినిమా తర్వాత అయన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పాలి.. లేటెస్ట్ గా వచ్చిన పవర్ ప్లే కూడా ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే తాజాగా స్టాండప్ రాహుల్ అనే సినిమా తో వస్తున్నాడు రాజ్ తరుణ్.. పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.. దీనిపై సమంత సెటైర్ వేసింది.

ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని తాజాగా సమంత విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌ని పంచుకుంటూ `మైక్‌ టెస్టింగ్‌ 1.. 2.. 3 చెక్‌ చెక్‌.. రాజ్‌ తరుణ్‌ కూర్చుంది చాలు` అంటూ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపింది సమంత. ప్రస్తుతం ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. మరోవైపు సమంత పెట్టిన కామెంట్‌ సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాతో మోహన్‌ వీరంకి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో రాజ్‌ తరణ్‌ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుంది. రొమాంటిక్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: