టాలీవుడ్ స్టార్ నటులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా ఇటు తెలుగుతో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. తొలిసారిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కెరీర్ పరంగా తొలిప్రేమ, బద్రి, ఖుషి వంటి సినిమాలతో యువతలో విశేషమైన ఆదరణ అందుకుని ముందుకు దూసుకెళ్లారు, టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో కి దగ్గరగా ఉన్న నటుల్లో ఒకరిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ తోపాటు హరిహర వీరమల్లు, అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ సినిమాలు కూడా చేస్తున్నారు.

మరోవైపు తొలిసారిగా నిన్ను చూడాలని మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు పలు సందర్భాల్లో బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో ఢీ కొట్టగా కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ మరికొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ విజేతగా నిలవడం జరిగింది.

ఇక ఇటీవల కొన్నాళ్లుగా సోషల్ మీడియా యొక్క వినియోగం మరింతగా పెరగడం అలానే ఒకప్పటితో పోలిస్తే హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ కూడా మరింతగా పెరగటం జరిగింది. అసలు మ్యాటర్ ఏమిటంటే నేడు ఉదయం నుంచి అటు ఎన్టీఆర్, ఇటు పవన్ కళ్యాణ్ ల పై వ్యతిరేక ట్యాగ్లు ఒక ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం లో జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ పై పవన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ఈ విధంగా నెగటివ్ ట్రెండ్స్ సృష్టిస్తూ ఉండడం సరైన విధానం కాదని టాలీవుడ్ హీరోలు అందరూ ఒక్కటేనని అదేవిధంగా వారి అభిమానులు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: