‘ఉయ్యాలా జంపాలా’ ‘సినిమా చూపిస్తా మామ’, ‘కుమారీ 21ఎఫ్’, వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో రాజ్ తరుణ్. ఇక ఆ తర్వాత ‘సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు’ వంటి సినిమాలు తీసిన అవి ఆశించినంతగా విజయాలను సాధించలేకపోయాయి.వరసగా ఎన్ని సినిమాలు చేసిన రాజ్తరుణ్ కి మాత్రం ఒక్క హిట్ కూడా రాలేదు. రొటీన్ సినిమాలు చేయడం వల్లేనేమో రాజ్ తరుణ్ కి హిట్ రావట్లేదు అని టాక్. 

అయితే ఈ మద్యనే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో వచ్చిన ‘ఓరెయ్ బుజ్జిగా’ ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.ఇక మళ్ళీ ఒరేయ్ బుజ్జిగా డైరెక్టర్ విజయ్ కుమార్‏ డైరెక్షన్లో మరో సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రంతోపాటు.. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మోహన్ వీరంకి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్‏గా నటించనున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే ఇన్ని సినిమాలు నటిస్తున్న కూడా రాజ్ తరుణ్ కి ఎప్పుడు హిట్ వస్తుందో అర్థం కావట్లేదు. ఆయన  నటించిన కొత్త సినిమా పవర్ ప్లే ఈ మద్యనే విడుదల అయింది. 

కానీ ఈ సినిమా విడుదల అయినట్టు కూడా చాలా మందికి తెలీదు. పవర్ ప్లే సినిమాకి మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు.అయితే ఈ ప్లాప్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఒకసారి ఈ సినిమాని చూడాలంటే చూసేయండి. ఇక రాజ్ తరుణ్ కి యూత్ లో బాగా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ కి ఒక సూపర్ హిట్ తోడైతే ఆయన రేంజ్ మారిపోతుంది. ఆయన తర్వాత సినిమాల్లో అన్న హిట్ వస్తుందేమో చూడాలి. కానీ ఇన్ని ప్లాప్స్ మధ్య కూడా రాజ్ తరుణ్ ఇంకా సినిమాలు చేస్తున్నారు అంటే విశేషం అనే చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: