పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తొలిసారిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ కి విషయం తెలిసిందే. ఆ తరువాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ వంటి సినిమాల విజయాలు హీరోగా పవర్ స్టార్ కి మంచి పేరు ని తెచ్చిపెట్టాయి . ఇక ఆ తరువాత తమ్ముడు, బద్రి సినిమాలతో మరొక సక్సెస్ లు అందుకున్న పవర్ స్టార్, ఆపై ఎస్ జె సూర్య దర్శకత్వంలో చేసిన సినిమా ఖుషి. ఏ ఎం రత్నం నిర్మాతగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శివాజీ, రాజన్ పి దేవ్, సుధాకర్, తదితరులు ఇతర పాత్రలు చేయగా భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా 2001లో విడుదలై అతి పెద్ద సంచలన విజయాన్ని దక్కించుకుని హీరోగా పవర్ స్టార్ కు యువత లో విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ మూవీ. ముఖ్యంగా ఈ సినిమాని రొమాంటిక్ లవ్ కం యాక్షన్ స్టోరీ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన తీరు ఎంతో అద్భుతం అనే చెప్పాలి. ఇక హీరోగా పవర్ స్టార్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, హీరోయిన్ భూమిక అందచందాలు, ఆకట్టుకునే నటన, మణిశర్మ అందించిన అద్భుతమైన ఆరు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాత ఏ ఎం రత్నం భారీ నిర్మాణ విలువలు వెరసి ఖుషి సినిమాకి అంతటి గొప్ప విజయాన్ని అందించాయి అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత పవన్ కళ్యాణ్ కి క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. కాగా ఈ సినిమా నేటితో విడుదలై సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు పవన్ ఫ్యాన్స్ దీని పేరుతో సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేసి వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా తమ హీరో పవర్ స్టార్ కి, ఖుషి చిత్ర యూనిట్ కి వారు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: