టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ప్రతీ హీరోకూ చిరంజీవే స్పూర్తి. కేవలం నటులకే కాదు, టెక్నికల్ విభాగాల్లో ఉన్న వారికి కూడా ఆయనే ఆదర్శం. జీవితకాలంలో ఒక్కసారి అయినా చిరంజీవి సినిమాలో పనిచేస్తే అదే ఆస్కార్ అవార్డు అని పొంగిపోయే వారు ఎంతో మంది టాలీవుడ్ లో ఉంటారు. దటీజ్ మెగాస్టార్.

అయితే చిరంజీవి అషామాషీగా మెగా శిఖరాన్ని అధిరోహించలేదు. దాని వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరెంతో కఠినమైన శ్రమ ఉంది. అన్నింటికీ మించి చిరంజీవి పట్టుదల, కృషి ఈరోజుకు ఆయన్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయనే చెప్పాలి. ఇదిలా ఉంటే చిరంజీవి ఫస్ట్ మూవీ ఏంటో అందరికీ తెలిసిందే. పునాదిరాళ్ళు. దాని డైరెక్టర్ రాజ్ కుమార్. ఆ మూవీలో మెయిన్ హీరో నరసింహరాజు. అయితే పునాది రాళ్ల కంటే ముందే ప్రాణం ఖరీదు మూవీ రిలీజ్ అయింది. అలా చిరంజీవి ఫస్ట్ సినిమా అది అయింది.

ఇక చిరంజీవి 1979లో మనవూరి పాండవులు అన్న సినిమాలో  నటించారు. అందులో పాండవుల్లో ఒకరిగా ఆయన పాత్ర ఉంటుంది. ఈ మూవీ రెబెల్ స్టార్ క్రిష్ణంరాజు సొంత నిర్మాణంలో వచ్చింది. అంతే కాదు ఈ మూవీని దిగ్దర్శకుడు బాపూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో చిరజీవి డెడికేషన్ అందరికీ ఆకట్టుకుందేదట. షూటింగ్ గ్యాప్ లో సైతం చిరంజీవి పాటకు తగినట్లుగా డ్యాన్సులు చేయడం, తన పాత్రను మరింతగా మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉండడం వంటివి చేసేవారట.

ఇక చిరంజీవి పెద్ద కళ్ళను చూసి బాపూ బాగా అట్రాక్ట్ అయ్యారట. ఈ కళ్ళు చాలు అద్భుతమైన నటనను పలికిస్తాయి అనేవారట. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి తన మొదటి చిత్రం నుంచి కూడా కృషిని నమ్ముకునే ముందుకు సాగారు. ఇక అయనకు కెరీర్ మొదట్లోనే  ఎన్టీయార్ తో తిరుగులేని మనిషి,  క్రిష్ణతో తోడు దొంగలు, శోభన్ బాబు తో మోసగాడు, క్రిష్ణంరాజు తో ప్రేమ తరంగాలు వంటి సినిమాలు చేసే అవకాశాలు రావడం ఒక లక్ గా చెప్పాలి. దాంతో సీనియర్లకు ధీటుగా నటించి చిరంజీవి సూపర్ అనిపించుకున్నారు. చిరంజీవి లోని తపన, వృత్తి పట్ల డెడికేషన్ చూసిన వారంతా గొప్ప స్టార్ అవుతాడు అని నాడే దీవించారు. నేడు అదే నిజం అయింది.





మరింత సమాచారం తెలుసుకోండి: