ఖుషి, తమ్ముడు, బద్రి వంటి క్లాస్ సినిమాలతో అలరించిన పవన్ కల్యాణ్ 2004లో గుడుంబా శంకర్ వంటి ఊర మాస్ మూవీ టైటిల్ తో ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తిని పెంచారు. ఇంటరెస్టింగ్ టైటిల్ ని చూడగానే మాస్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం మాస్ ఆడియన్స్ ని బాగా నిరాశపరిచింది. నిజానికి ఈ సినిమా డైరెక్టర్ వీరశంకర్ క్లైమాక్స్ ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్లతో రూపొందించాలని అనుకున్నారు కానీ ఆ విషయంలో పవన్ డైరెక్టర్‌తో విభేదించి క్లైమాక్స్ చాలా సహజంగా ఉండాలని చెప్పారట. తన రీసెంట్ సినిమాలన్నీ కూడా చాలా సహజంగా ఉన్నాయి.


'ఈ సినిమాలో కొత్తగా అసహజమైన సన్నివేశాలు చేయాలనుకోవడం లేదు. కావాలంటే మీరు మళ్లీ రీ షూట్ చేయండి.. నాకేం అభ్యంతరం లేదు,' అని పవన్ చెప్పారట కానీ ఎడిటింగ్ పూర్తయిన తర్వాత ఒక మూడో వ్యక్తి వచ్చి సినిమా మొత్తం చూసి పవన్ కోరుకున్నట్లుగానే క్లైమాక్స్ చాలా సహజంగా ఉందని చెప్పారట. దీంతో పవన్ కి ఇష్టం లేకుండా బలవంతంగా యాక్షన్ సన్నివేశాలు చేయించడం ఎందుకని భావించి వీరశంకర్ కూడా పవన్ కోరినట్లుగానే క్లైమాక్స్ ని చాలా సహజంగా ఉంచారట.



కానీ భారీ అంచనాలు పెట్టుకొని గుడుంబా శంకర్ సినిమా వీక్షించడానికి థియేటర్లకు వచ్చిన మాస్ ఆడియన్స్ పేలవమైన క్లైమాక్స్ చూసి నిరాశ పడ్డారని.. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగానే గుడుంబా శంకర్ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయ్యిందని వీరశంకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను అనుకున్న విధంగా క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లయితే గుడుంబా శంకర్ సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బాస్టర్ అయ్యేదేమోనని.. సినిమా నిర్మాతలకు ఇంకాస్త ఎక్కువగా డబ్బులు వచ్చి ఉండేయేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు బలహీనమైన క్లైమాక్స్ కారణంగా పవన్ కల్యాణ్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ నష్టపోయారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: